హైదరాబాద్: మసాబ్ ట్యాంక్ సమీపంలోని నందమూరి హరికృష్ణ నివాసానికి బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖులు చేరుకుంటున్నారు. హరికృష్ణ పెద్దకుమారుడు జానకిరామ్ ఈ సాయంత్రం నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి, భార్యతో వచ్చారు. నారా లోకేష్, బ్రహ్మణి దంపతులు, బాలకృష్ణ భార్య, ఇతర బంధువులు ఒక్కొక్కరు వస్తున్నారు.
జానకిరామ్ మృతదేహాన్ని కోదాడ ఆస్పత్రి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలోని వైద్యులు పోస్ట్మార్టం నిర్వహిస్తారు.
**
హరికృష్ణ నివాసానికి చేరుకుంటున్న ప్రముఖులు
Published Sat, Dec 6 2014 8:39 PM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement
Advertisement