'ఎన్టీఆర్ మనవడినని తెలియనీయలేదు' | Yarlagadda Lakshmi Prasad tribute to Nandamuri Janakiram | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 7 2014 3:56 PM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM

నందమూరి జానకిరామ్ మంచితనం మూర్తీభవించిన కుర్రాడని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరామ్ కు ఆయన ఆదివారం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జానకిరామ్ ఏడాది పాటు తమ ఇంటిలో ఉండి ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్నాడని గుర్తు చేసుకున్నారు. మహానటుడు ఎన్టీఆర్ మనవడినని ఎవరికీ తెలియనీయలేదని చెప్పారు. జానకిరామ్ మరణం హరికృష్ణకు తీరనిలోటని అన్నారు. పుత్రశోకం అనుభవించిన తనకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసునని సీనియర్ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ అన్నారు. తన కుమారుడు, కోట శ్రీనివాసరావు కొడుకు రోడ్డు ప్రమదాల్లో మృతి చెందారని ఆయన గుర్తు చేశారు. జానకిరామ్ మృతి పట్ల ఆయన ప్రగాఢ సంపతాం తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement