హైదరాబాద్ చేరుకున్న జానకిరామ్ మృతదేహం | Janakiram dead body arrived Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చేరుకున్న జానకిరామ్ మృతదేహం

Published Sat, Dec 6 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

జానకిరామ్ మృతదేహం

జానకిరామ్ మృతదేహం

హైదరాబాద్: నందమూరి హరికృష్ణ  పెద్దకుమారుడు జానకిరామ్ మృతదేహం హైదరాబాద్ చేరుకుంది.   నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద  ఈ సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో  జానకిరామ్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.  మృతదేహాన్ని కోదాడ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో  ఈ రాత్రి  డాక్టర్ జనార్ధన్, డాక్టర్ సత్యవతి ఆధ్వర్యంలో  వైద్య బృందం పోస్ట్ మార్టం నిర్వహిస్తారు

నందమూరి కుటుంబ సభ్యులతోపాటు పలువురు ఏపీ మంత్రులు, టీడీపి నాయకులు  ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో మృతదేహానికి పోస్ట్ మార్టం చేస్తారు. ఆ తరువాత మృతదేహాన్ని హరికృష్ణ నివాసానికి తరలిస్తారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement