
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చలమేశ్వర్‌ను శాలువా, జ్ఞాపికతో సాదరంగా సీఎం జగన్ సత్కరించారు. చలమేశ్వర్ వెంట అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు. కాగా, గతేడాది జూన్ 11న విజయవాడలో ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు చలమేశ్వర్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. (చదవండి: మాట నిలబెట్టుకున్న సీఎం జగన్)
జస్టిస్ చలమేశ్వర్‌ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment