-‘ప్రాచీన హోదా’పై పిటిషన్‌ను కొట్టివేయడంపై యార్లగడ్డ
సాక్షి, న్యూఢిల్లీ
తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను చెన్నై హైకోర్టు కొట్టివేయడం సంతోషకరమని పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఇది తెలుగు ప్రజలకు శుభదినం అని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో యార్లగడ్డ విలేకరులతో మాట్లాడారు. మాతృభాషపై ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలుగును ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ప్రపంచ భాషగా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. తెలుగు భాష అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. కేసును మద్రాసు కోర్టు కొట్టివేయడంతో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎంపీలకు యార్లగడ్డ మిఠాయిలు ఇచ్చి ఆనందాన్ని పంచుకున్నారు.
తెలుగు ప్రజలకు ఇది శుభదినం
Published Mon, Aug 8 2016 7:38 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
Advertisement