గొల్లపూడికి లోక్‌నాయక్ పురస్కారం | Gollapudi Maruti Rao Lok Nayak Award | Sakshi
Sakshi News home page

గొల్లపూడికి లోక్‌నాయక్ పురస్కారం

Published Tue, Nov 25 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

గొల్లపూడికి లోక్‌నాయక్ పురస్కారం

గొల్లపూడికి లోక్‌నాయక్ పురస్కారం

విశాఖపట్నం: ఈ ఏడాది లోక్‌నాయక్ పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, సాహిత్యవేత్త గొల్లపూడి మారుతీరావుకు అందజేయనున్నట్టు లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 18న విశాఖపట్నంలోని కళాభారతిలో ఈ అవార్డు అందజేస్తామని  తెలిపారు.

అవార్డు కింద రూ.1.25 లక్షల నగదును, ప్రశంసా పత్రాన్ని అందిస్తామన్నారు. 2005 నుంచి ఈ అవార్డులను అందిస్తున్నామన్నారు. తెలుగు సాహితీ రంగానికి జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు లభించడం లేదన్న అవేదనను యార్లగడ్డ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. విశాఖలో శ్రీశ్రీ, రావిశాస్త్రి నివసించిన గృహాలను స్మారక మందిరాలుగా గుర్తించి పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement