
విలేకరులతో మాట్లాడుతున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌లు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. తెలుగు బాషను ఓ సబ్జెక్టుగా పెడతామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. చంద్రబాబు తెలుగు భాషాభివృద్ధికి చేసింది శూన్యమన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన మాటపై నిలబడి తెలుగు భాషకు ప్రాణం పోశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలుగు భాష వ్యతిరేకి అని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు యార్లగడ్డ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment