చంద్రబాబు పాపాలకు త్వరలోనే శిక్ష ఖాయం | AP Ex-Minister Kodali Nani Slams Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

చంద్రబాబు చేసిన పాపాలకు త్వరలోనే శిక్ష ఖాయం: కొడాలి నాని

Published Tue, Sep 5 2023 8:02 AM | Last Updated on Tue, Sep 5 2023 11:06 AM

AP Ex Minister Kodali nani Visits Tirumala slams Chandrababu Naidu - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా చేసిన పాపాలకు అతిత్వరలోనే శిక్ష పడుతుందని ఏపీ మాజీ మంత్రి, గుడివాడ వైఎస్సార్‌సీపీ  ఎమ్మెల్యే కోడాలి నాని అన్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

సాధారణంగా కొండపై రాజకీయాలు మాట్లాడను. కానీ, చంద్రబాబు నాయుడు తనకు ఐటీ నోటీసులు వచ్చినా.. ఆ విషయాన్ని చాలా చిన్నగా తీసుకుంటున్నారు. ఎవరి చేతిలోనైనా తప్పించుకోవచ్చు గాని దేవుడి నుంచి.. ప్రజల చేతుల్లోంచి తప్పించుకోలేరని చంద్రబాబు నాయుడికి హితవు పలికారాయన. అలాగే.. చేసిన పాపాలకు త్వరలోనే ఆయనకు సరైన శిక్ష పడుతుందని కొడాలి నాని అన్నారు.

‘‘కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగిందని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement