
వీవర్స్ ఇండియా
హ్యాండ్లూమ్, పట్టు, కాంజీవరం, ఆర్గానిక్ చీరలు వేలాదిగా కొలువుదీరాయి. వేటికవే ప్రత్యేకతను చాటుకొంటున్నాయి. జూబ్లీహిల్స్‌లో కొత్తగా ఏర్పాటైన వీవర్స్ ‘ఇండియా హ్యాండ్లూమ్ స్టోర్స్’లోని వెరైటీలు నగరవాసుల మనసు దోస్తున్నాయి. దేశంలో పేరెన్నికగన్న డిజైనర్ల విభిన్న ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఈ స్టోర్‌లో డిజైనర్ స్టూడియో కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖ సోషలైట్ పింకిరెడ్డి, మాస్టర్ హ్యాండ్లూమ్ డిజైనర్ గాజం అంజయ్య... స్టోర్‌లోని వెరైటీలను ఆసక్తిగా తిలకించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చేనేతలు ప్రతిబింబిస్తాయన్నారు.