- కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో చేనేత వస్త్ర ఉత్పత్తులకు ప్రోత్సాహం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. శనివారం క్యాంపు కార్యాలయంలో తనను కలసిన కేంద్రమంత్రితో ఆయన రాష్ట్రంలో చేనేత పరిశ్రమ, డ్రైపోర్టుల అభివృద్ధి, మూసీ ప్రక్షాళన తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మెహిదీపట్నంకు చెందిన బాలమణి దంపతులు ‘డబుల్ ఇకత్ వీవింగ్ హ్యాండ్లూమ్’ పరిజ్ఞానంతో తయారు చేసిన చీరలను సీఎం కేసీఆర్, కేంద్రమంత్రికి చూపించారు. దీనిపై స్పందించిన నిర్మలా సీతారామన్ తెలంగాణలో చేనేత పరిశ్రమకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. సబర్మతి తరహాలో మూసీనది పరివాహక ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని యోచిస్తున్నామని, దీన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని, తెలంగాణలో డ్రైపోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కేసీఆర్ కోరారు.