పోచంపల్లిని సందర్శించిన విదేశీయులు | Foreigners visited the pochampalli | Sakshi
Sakshi News home page

పోచంపల్లిని సందర్శించిన విదేశీయులు

Published Mon, Oct 3 2016 10:30 PM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

పోచంపల్లిని సందర్శించిన విదేశీయులు - Sakshi

పోచంపల్లిని సందర్శించిన విదేశీయులు

భూదాన్‌పోచంపల్లి: చేనేత వృత్తిలో మహిళల భాగస్వామ్యం– అభివృద్ధిని అధ్యయనం చేయడానికి సోమవారం విదేశీ అధికారుల బృందం పోచంపల్లిని సందర్శించారు. హైదరాబాద్‌లోని జాతీయ సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల సంస్థ ఆధ్వర్యంలో తజకిస్తాన్, హోండూరస్, మాల్దీవులు, ఇరాక్, టాంజానియా, జాంబియా, ఇ«థియోపియా, శ్రీలంక, సిరియా, ఘనా, జింబాబ్వే, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, లిథునియా, లిబేరియా దేశాలకు చెందిన 33 మంది సభ్యులు పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌ను సందర్శించారు. ఇక్కడ తయారవుతున్న చేనేత వస్త్రాలు, వస్త్ర తయారీ ప్రక్రియలు, మార్కెటింగ్, పనిచేస్తున్న కార్మికులలో మహిళలు ఎంత మంది పనిచేస్తున్నారు, వారికి లభిస్తున్న గిట్టుబాటు ఆరా తీశారు. వారి వెంట ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ వివేక్‌కుమార్, వి. స్వప్న, పార్క్‌ డైరక్టర్లు చిక్క కృష్ణ, చిట్టిపోలు గోవర్దన్, అశోక్, వెంకటయ్య పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement