చేనేత సంపదను కాపాడుకుందాం
Published Sun, Aug 7 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
మహబూబ్‌నగర్ వ్యవసాయం: ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేనేతవస్త్రాల తయారీలో మెళకువలు పాటించి నాణ్యమైన వస్త్రాలను తయారు చేయాలని జేసీ ఎం.రాంకిషన్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుల కార్యాలయం ఆవరణలో జరిగిన చేనేత దినోత్సవంలో ఆయన మాట్లాడారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారుచేసిన ఘనత జిల్లా చేనేత కార్మికులకే దక్కిందన్నారు. జిల్లాలోని గద్వాల, నారాయణపేట చేనేతవస్త్రాలకు ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. చేనేత కార్మికులు నేత పనిలో సాంకేతిక పద్ధతులను అలవర్చుకుంటే నంబర్‌వన్‌గా నిలుస్తామన్నారు. చేనేత వస్త్రాల విక్రయం కోసం అమెజాన్ వంటి కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ ఎం.రాంకిషన్ కోరారు. అంతకుముందు జిల్లాకేంద్రంలో చేనేత ర్యాలీని జేసి రాంకిషన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీ తిరుమల్‌రావు, సెరికల్చర్ డీడీ గోపాల్, డీఓలు జహీరుద్దీన్, సంతోష్, రాములు, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గట్టు వీరన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement