jc ramkishan
-
చేపపిల్లల సరఫరాకు టెండర్లు ఖరారు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు వందశాతం సబ్సిడీపై చేపపిల్లలు సరఫరా చేసేందుకుగాను సోమవారం టెండర్లను ఖరారు చేశారు. ఈ మేరకు జేసీ రాంకిషన్ సమక్షంలో టెండరుదారుల దరఖాస్తులను పరిశీలించారు. లక్ష చేపపిల్లల కోసం ఆరుగురు టెండర్లు దాఖలు చేయగా, రూ.79,900లకు కోట్ చేసిన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భుజబలికి చెందిన ఫణీంద్రవర్మను ఎంపిక చేశారు. నిబంధనల ప్రకారం జిల్లాలోని 609 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని చెరువులు, 15 రిజర్వాయర్లలో ఈ చేపపిల్లలను వదలాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో కొనుగోలు కమిటీ సభ్యులు మత్స్య శాఖ ఏడీ ఖదీర్‌అహ్మద్, పశుసంవర్ధక శాఖ జేడీ దుర్గయ్య, డీఐఓ మూర్తి, సెట్మా సీఈఓ హన్మంతరావు పాల్గొన్నారు. -
కవులు, పత్రికల ఆలోచన విధానం మారాలి
జేసీ రాంకిషన్ జడ్చర్ల టౌన్ : కవులు, పత్రికల ఆలోచన విధానం మారాలని, సానుకూల ధక్పథంతోపాటు సంఘటితంగా ముందుకు సాగితే పాలమూరు జిల్లా రూపురేఖలు మారతాయని జేసీ రాంకిషన్ అన్నారు. శనివారం జడ్చర్ల బూర్గుల రామకష్ణారావు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలతోపాటు, పాలమూరు జిల్లా సాహితి వికాసం సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కరువు, వలసలు, లేబర్ జిల్లాగా పాలమూరును వర్ణించటం సబబు కాదని, అలా ఎందుకు మారిందని ఆలోచించాలన్నారు. విద్య, వైద్యంలో వెనకబడిపోవటం వల్లే పాలమూరు అభివద్ధి కుంటుపడిందని, అక్షరాస్యత శాతం పెరిగితేనే వనరుల సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. అందుకే బాగా చదువుకుని మీరే మార్పు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. పత్రికల్లోనూ నెగెటివ్ వార్తలు కాకుండా పాజిటివ్ వార్తలు వ్రాయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు పెట్టేందుకు ఎంతో అనుకూలమైన జిల్లాగా పాలమూరు ఉందని, ఏడాదికిందట పారిశ్రామిక వేత్తలతో కొత్తురూలో సమావేశం నిర్వహించగా ఊహించినదానికన్నా ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. కష్ణాపుష్కరాల్లో సేవలందించిన ఎన్ఎస్ఎస్ వలంటీర ్లకు ప్రశంస పత్రాలను అందజేశారు. అంతకు ముందు ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భక్తవత్సల్‌రెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ అనంత్‌రెడ్డి, కార్యదర్శి నటరాజ్, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు విశ్వనాథం, సభ్యులు ప్రవీణ్‌కుమార్, కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారులు తమ్మిరెడ్డి, అశోక్‌కుమార్, జ్యోతి, ప్రియాంకలు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల వెల్లువ
ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించాలని వినతి ఫిర్యాదులు స్వీకరించిన జేసీ రాంకిషన్ ఈ వారం మొత్తం ఫిర్యాదులు 176 మహబూబ్‌నగర్ న్యూటౌన్: కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో ప్రజలు తరలివచ్చారు. కృష్ణా పుష్కరాలు నేపథ్యంలో నాలుగు వారాలుగా ప్రజావాణిని రద్దు చేశారు. దీంతో ప్రజలు తమ పిర్యాదులు, వినతులు సమర్పించేందుకు సోమవారం కలెక్టరేట్‌కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు ఫిర్యాదుదారులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. జేసీ ఎం.రాంకిషన్, డీఆర్వో భాస్కర్, మెప్మా పీడీ లింగ్యానాయక్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూముల సమస్యలు, కబ్జాలు, రుణాలు, ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ వినతులు వచ్చాయి. ఈ వారం ప్రజావాణికి వినతులు, ఫిర్యాదులు 170, ఆన్లైన్ పరిష్కారం కార్యక్రమానికి ఆరు ఫిర్యాదులు వచ్చాయి. నా పింఛన్ వేరే వాళ్లు తీసుకుంటున్నారు ‘మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా పనిచేస్తున్న నా భర్త ఎ.చిన్ననర్సయ్య అనారోగ్యం మృతి చెందాడు. ప్రభుత్వం నుంచి వచ్చిన బెనిఫిట్లన్నింటిని వీరన్నపేటకు చెందిన లక్ష్మయ్య, సిద్ధయ్య కాజేశారు. నాకు రావాల్సిన పింఛన్ కూడా వాళ్లే తీసుకుంటున్నారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నాను. పెద్దదిక్కు కోల్పోయిన నాకు సాయం చేయండి.’ – ఎ.నాగమ్మ, మహబూబ్‌నగర్ సారాయి మానేశాం.. ఉపాధి చూపండి ‘సారాయి తయారు చేసి అమ్ముకుని ఇంతకాలం జీవనం సాగించాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మేము పూర్తిగా సారాయి వృత్తిని మానేశాం. ఇప్పుడు మాకు ఉపాధి లేదు. బ్యాంక్ నుంచి రుణాలిచ్చి, ఆర్థిక సహాయం చేస్తే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని బతుకుతాం. దయ చూపండి సారూ’ అని తిమ్మాజిపేట మండలం పుల్లగిరికి చెందిన ముడావత్ మారు, ముడావత్ నీల, జయమ్మ, బన్నీబాయి వేడుకున్నారు. లీజును రద్దు చేయాలి పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ శివారులో సర్వే నం.521లో ఎస్వీఆర్ మినరల్స్ కంపెనీకి ఇచ్చిన 39ఎకరాల సున్నపురాయి లీజును రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎంపీటీసీ సత్యంసాగర్, రాజు, దామోదరచారి విన్నవించారు. లీజును రద్దు చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కొందరు వ్యక్తుల ప్రోత్సాహంతో అక్రమంగా బ్లాస్టింగులు చేస్తూ దొంగచాటున సున్నపురాయిని తీసుకెళుతున్నారని ఆరోపించారు. పేపర్‌మిల్లును తొలగించాలని.. కొత్తూరు మండలం సోదాపూర్ గ్రామ శివారులో ఉన్న పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పంటలు నష్టపోతున్నామని, పేపర్ మిల్లును తొలగించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన జైపాల్‌రెడ్డి, జంగారెడ్డి, రవీందర్, మరో పదిమంది జేసీకి విన్నవించారు. గుంపు మేస్త్రీపై చర్య తీసుకోవాలి గుంపు మేస్త్రీల చెర నుంచి వలస కార్మికులను విడిపించాలని, చట్టవిరుద్ధంగా వలసలు తీసుకెళ్తున్న అమరచింతకు చెందిన గొల్లరాములు, కొంకనోనిపల్లికి చెందిన బోయ చెన్నప్పలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ నెల 6న రాత్రి ఒక వాహనంలో కూలీలను తరలిస్తుండగా చిన్నచింతకుంట తహసీల్దార్‌కు సమాచారమిచ్చినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. -
చేనేత సంపదను కాపాడుకుందాం
మహబూబ్‌నగర్ వ్యవసాయం: ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేనేతవస్త్రాల తయారీలో మెళకువలు పాటించి నాణ్యమైన వస్త్రాలను తయారు చేయాలని జేసీ ఎం.రాంకిషన్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుల కార్యాలయం ఆవరణలో జరిగిన చేనేత దినోత్సవంలో ఆయన మాట్లాడారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారుచేసిన ఘనత జిల్లా చేనేత కార్మికులకే దక్కిందన్నారు. జిల్లాలోని గద్వాల, నారాయణపేట చేనేతవస్త్రాలకు ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. చేనేత కార్మికులు నేత పనిలో సాంకేతిక పద్ధతులను అలవర్చుకుంటే నంబర్‌వన్‌గా నిలుస్తామన్నారు. చేనేత వస్త్రాల విక్రయం కోసం అమెజాన్ వంటి కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ ఎం.రాంకిషన్ కోరారు. అంతకుముందు జిల్లాకేంద్రంలో చేనేత ర్యాలీని జేసి రాంకిషన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీ తిరుమల్‌రావు, సెరికల్చర్ డీడీ గోపాల్, డీఓలు జహీరుద్దీన్, సంతోష్, రాములు, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గట్టు వీరన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ శాఖది కీలకపాత్ర
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ప్రజాసేవలో రెవెన్యూ శాఖది కీలకపాత్ర అని జేసీ ఎం.రాంకిషన్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వీఆర్వోలు, మీసేన ఆపరేటర్లకు వెబ్‌ల్యాండ్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయాల్లో టీంవర్క్ ముఖ్యమన్నారు. మ్యుటేషన్ దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో ఉంచుతున్నారని వీఆర్వోలను ప్రశ్నించారు. పనుల్లో పురోగతి పెంచాలని, ఎల్ఈసీ కార్డుల జారీ, మ్యుటేషన్లు, సాదాబైనామా, ప్రభుత్వ భూముల పరిశీలనపై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఎన్ఐసీ డీఐఓ మూర్తి, మీసేన సూపరింటెండెంట్ బక్కా శ్రీనివాసులు పాల్గొన్నారు.