
హ్యాండ్లూమ్ బోర్డ్ అనధికార సభ్యుడిగా కళామందిర్ శ్రీనివాస్
హైదరాబాద్: ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్ అనధికార సభ్యుడిగా సాయి సిల్‌క్స(కళామందిర్) డెరైక్టర్ అన్నం కళ్యాణ్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని టెక్స్‌టైల్స్ పరిశ్రమకు శ్రీనివాస్ చేసిన సేవలు కారణంగా ఆయనకు ఈ గుర్తింపు లభించిందని సాయి సిల్క్స్ (కళామందిర్) ఒక ప్రకటనలో తెలిపింది. 1974లో విజయవాడలో జన్మించిన ఆయన కామర్స్, న్యాయశాస్త్రాల్లో పట్టభద్రులని, ఎంబీఏ అభ్యసించారని పేర్కొంది. ఆయన సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నారని పేర్కొంది. రాష్ట్రంలో టెక్స్‌టైల్స్, చేనేత రంగ పటిష్టానికి శ్రీనివాస్ నియామకం దోహదపడగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.