- చేనేత, జౌళి శాఖ ఏడీ పవన్‌కుమార్
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాలోని చేనేతలకు ముద్ర పథకం ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చేనేత, జౌళి శాఖ ఏడీ పవన్‌కుమార్ తెలిపారు. రుణాల ముంజూరుకు పెద్ద ఎత్తున దరఖాస్తులందాయన్నారు. ఫీల్డ్ ఆఫీసర్ల ద్వారా క్షేత్రస్థాయిలో ఆయా దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. చేనేతల ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, మగ్గం తదితర వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత అర్హత కలిగిన వారందరికీ రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంకులకు వివరాలను అందిస్తామన్నారు.