‘చేనేత’ను జీఎస్టీ నుంచి మినహాయించండి
ప్రధానిని కోరిన ఎంపీ బుట్టా రేణుక
సాక్షి, న్యూఢిల్లీ: చేనేత, దాని అనుబంధ రంగాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పార్లమెంటులో ప్రధానిని కలసిన రేణుక, పన్ను విధించడం వల్ల చేనేత రంగంపై పడుతున్న భారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చేనేత రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా నాలుగున్నర కోట్ల మంది, పరోక్షంగా 6 కోట్ల మంది జీవిస్తున్నారని వివరించారు. గతంలో ఎలాంటి పన్ను లేని ఈ రంగంపై పన్ను విధించడం వల్ల చేనేతకారుల జీవనోపాధికి గడ్డు పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు.