చేనేత పాలసీని వెంటనే ప్రకటించాలి
రామగిరి : నూతన చేనేత పాలసీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోషిక యాదగిరి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలె వెంకటనారాయణ, అవ్వారి భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని ఎస్పీటీ మార్కెట్ సమావేశ మందిరంలో నిర్వహించిన తెలంగాణ పద్మశాలి యువజన సంఘం జిల్లా సదస్సులో వారు మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, నామినేటెడ్ పోస్టుల్లో పద్మశాలీలకు అవకాశం కల్పించాలని, బీసీ విద్యార్థులకు అన్ని కోర్సుల్లో పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో పద్మశాలి యువత రాజకీయాల్లో రాణించాలని కోరారు. అందుకోసం ఇప్పటి నుంచే ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సిరిప్రోలు వెంకటపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల యాదగిరి, పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, కార్యదర్శి తిరందాసు సంతోష్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోషిక అంజన్, సిలివేరు నారాయణ, పట్టణ అధ్యక్షులు వెంకటయ్య, శ్రీనివాసమూర్తి, సిలివేరు చంద్రయ్య, మిర్యాల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.