మాట్లాడుతున్న విక్రమ్‌కుమార్
-
సీపీఎస్‌ఈఏ రాష్ట్ర కార్యదర్శి విక్రమ్‌కుమార్
తిరుమలాయపాలెం : 2004 తర్వాత నియామకం పొందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఈఏ రాష్ట్ర కార్యదర్శి విక్రమ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఎస్ విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సీపీఎస్ విధానం వల్ల చాల నష్టాలున్నాయని తెలిపారు. పెన్షన్ అనేది ప్రతి ఉద్యోగి హక్కు అని అత్యున్నత న్యాయస్థానం తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శశిదర్, ఉప్పలయ్య, నాయకులు రవికిషోర్, వీఆర్‌ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.గురుమూర్తి, మెడికల్ ఉద్యోగుల ప్రతినిధి డాక్టర్ జగ్గులాల్, ఆయా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రమణారావు, నాగేశ్వరరావు, కిరణ్, వీరబాబు, వీరభద్రం, హవీలా, మౌలాలి, వసీం తదితరులు పాల్గొన్నారు.