
భూదాన్‌పోచంపల్లి : రెండేళ్ల క్రితం ఎమిరేట్స్ ఆఫ్ జేడబ్ల్యూటీ హైదరాబాద్ చైర్మన్ అయిన సంతాజాన్ ఫేస్ బుక్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఇందులో అడిషనల్ డీజీపీ(స్పోర్ట్స్) తేజ్‌దీప్ కౌర్ మీనన్‌తోపాటు మరో ఇద్దరు అడ్మిన్‌గా ఉన్నారు. రెండేళ్లలో దేశవ్యాప్తంగా 12,796 మంది సభ్యులుగా చేరారు. గ్రూప్‌లో ఉన్న ప్రతి మహిళ ఏడాదిలో 100 వెరైటీ చీరలు కొనుగోలు చేసి ధరించాలన్నది దీని ముఖ్య ఉద్దేశం. ఇలా ఆయా రాష్ట్రాల్లో పేరొందిన చీరలను ధరించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలి. అంతేకాక వేసుకున్న బ్లౌజ్ డిజైన్ విశేషాలను కూడా తోటి మహిళలతో పంచుకోవాలి.
చేనేతకు ఉపాధి
ఆయా రాష్ట్రాల్లో పెరెన్నికగన్న పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేగ, సిద్ధిపేట గొల్లబామ చీరలు, బెనారస్, చదారీ, సంబల్‌పురి, కాంచివరం, పైతాని, డకాయ్, జామ్‌దానీ, ఒడిషా, గుజరాతి ఇక్కత్ ఇలా అనేక వెరైటీ చీరలను ఎగ్జిబిషన్‌లలో కొనుగోలు చేస్తుంటారు. ప్రతి మహిళ ఏడాదిలో 100 చీరలను కొనుగోలు చేసి ధరించాల్సి ఉంటుంది. ఇలా చీరలను కొనుగోలు చేస్తూ చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాదు నేటి యువతకు చీర గొప్పదనాన్ని చాటిచెబుతున్నారు.
మొదటిసారిగా పోచంపల్లి సందర్శన
గ్రూప్ అడ్మిన్ అడిషనల్ డీజీపీ (స్పోర్ట్స్) తేజ్‌దీప్ కౌర్ మీనన్ ఆధ్వర్యంలో ది గ్లోబల్ 100 సారీస్ పాక్ట్ గ్రూప్‌సభ్యులు మొదటిసారిగా పోచంపల్లి క్షేత్ర పర్యటన నిమిత్తం ఇక్కడికి వచ్చారు. ఇక్కడ తయారవుతున్న చీరలను ప్రత్యక్ష చూశారు. చీరల తయారీలో కార్మికుల శ్రమ విలువను తెలుసుకున్నారు. కార్మికుల కళానైపుణ్యాలకు కొనియాడారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు ఉన్న గుర్తింపును అడిగి తెలుసుకున్నారు.
చీరలు బాగున్నాయి
పోచంపల్లి ఇక్కత్ చీరలంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో వెరైటీలను కొనుగోలు చేసి ధరించా. ఇప్పటివరకు 98 చీరలు కొనుగోలు చేశా. నెలాఖరులోగా 100 చీరల టార్గెట్ పూర్తి చేయాల్సి ఉండగా, పోచంపల్లిలో 2 చీరలు కొనుగోలు చేసి టార్గెట్ పూర్తి చేస్తా.
–హిమబిందు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
సంప్రదాయానికి ప్రతీక..
చీరలు సం స్కృతి, సం ప్రదాయానికి ప్రతీక. ఇప్పటివరకు ఆయా రాష్ట్రాలలోని అనేక చీరలను కొనుగోలు చేశాను. చీరల కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాం. మొదటిసారి పోచంపల్లి సందర్శనకు వచ్చాం. చీరలు ఎంతో నచ్చాయి.
– సుమ, గృహిణి, హైదరాబాద్
350 చీరలు సేకరించా..
రెండేళ్లలో 350 వెరైటీ చీరెలు కలెక్షన్ చేశారు. నేను కొనుగోలు చేసిన ప్రతిచీరకు ఒక ప్రత్యేకత ఉంటుంది. పోచంపల్లి ఇక్కత్ చీరలు నిండుదనంగా ఉంటా యి. పశ్చిమబెంగాల్‌లో డకాయ్, జామ్‌దానీ చీరలు ప్రసిద్ధి. వీటివిలు వ రూ.30వేల వరకు ఉంటాయి.
– మంజుశ్రీ బసు,పశ్చిమబెంగాల్
నేటితరానికి పరిచయం చేయాలని..
చీర గొప్పదనాన్ని నేటితరానికి పరిచ డం చేయడానికి ఫేస్‌బుక్ గ్రూప్ దోహదపడుతుంది. గ్రూప్‌లో మహిళలతోపాటు యవతకు కూడా చేరుతున్నారు. వందల మంది గ్రూప్ ఫాలో అవుతున్నారు. రోజూ వేల డిజైన్లు పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
–ప్రజ్ఞ, ఉద్యోగి
Comments
Please login to add a commentAdd a comment