నాగచైతన్య- శోభితా ధూళిపాళ్లను ఆశీర్వదించండి: నాగార్జున | Nagarjuna Officially Announced His Son Naga Chaitanya Engagement | Sakshi
Sakshi News home page

నాగచైతన్య- శోభితా ధూళిపాళ్లను ఆశీర్వదించండి: నాగార్జున

Aug 8 2024 1:25 PM | Updated on Aug 8 2024 3:21 PM

Nagarjuna Officially Announced His Son Naga Chaitanya Engagement

అక్కినేని నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల వివాహబంధంలో అడుగుపెట్టబోతున్నట్లు అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం గురించి ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా నాగార్జున తన ఎక్స్‌ పేజీలో అధికారికంగా ప్రకటించారు. నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

నాగచైతన్య నిశ్చితార్థం గురించి నాగార్జున ఇలా పంచుకున్నారు.  'ఈ రోజు ఉదయం 9:42 గంటలకు  మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళ్లతో జరిగింది. ఈ విషయాన్ని ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు. వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను.' అని నాగ్‌ తెలిపారు.

ఎవరీ శోభితా ధూళిపాళ్ల..?
శోభితా ధూళిపాళ్ల ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన అమ్మాయి.  బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆమె  విశాఖపట్నంలో లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదివింది. ఆపై ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్‌లో కామర్స్ అండ్‌ ఎకనామిక్స్ పూర్తి చేసింది.ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో శిక్షణ తీసుకుంది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. 

శోభితా ధూళిపాళ్ల 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 లో తొలిసారిగా నటించింది.  అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాళ కీలకమైన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. పొన్నియిన్‌ సెల్వన్‌ ,ది నైట్‌ మేనేజర్‌ 2, గూఢాచారి,మేజర్‌,కురుప్ వంటి చిత్రాల్లో మెప్పించింది. కల్కి చిత్రంలో దీపికా పదుకొణ్‌కు తెలుగు డబ్బింగ్‌ కూడా చెప్పింది. 

సమంతతో బ్రేకప్‌
2017లో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న  నాగచైతన్య అనుకోని కారణాలతో 2021లో విడిపోయారు. అయితే, వారిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ వారు రివీల్‌ చేయలేదు. కానీ, వారు తమ కెరీర్‌పై దృష్టి పెట్ వివిధ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement