Actress Sobhita Dhulipala Decides Her Career With Coin Toss - Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: లక్ కాదు.. ఈ బ్యూటీకి కాయిన్ కలిసొచ్చింది!

Published Fri, Jul 21 2023 8:58 PM | Last Updated on Fri, Jul 21 2023 9:26 PM

Actress Sobhita Dhulipala Decide Career With Coin Toss - Sakshi

చాలామంది భామలు.. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. కృతిశెట్టి, శ్రీలీల లాంటి బ్యూటీస్ మాత్రం ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే, మరోవైపు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శోభిత ధూళిపాళ్ల మాత్రం ఓ కాయిన్ వల్ల హీరోయిన్ అయిపోయింది. ఏంటి నమ్మట్లేదా? అయితే మొత్తం చదివితే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. 

(ఇదీ చదవండి: స్టార్ సింగర్‌కి బెదిరింపు.. తలకు తుపాకీ గురిపెట్టి!)

బాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తున్న శోభిత.. వైజాగ్‌లో పెరిగింది. చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఇది జరిగిన మూడేళ్లకు హిందీ సినిమా 'రమణ్ రాఘవ్ 2.0'తో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత హిందీతోపాటు తమిళ, మలయాళ భాషల్లో వరస చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయింది. 

తెలుగులో అడివి శేష్ 'గూఢచారి'లో మాత్రమే నటించిన శోభిత.. తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొంది. తన కెరీర్ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టింది. 'వైజాగ్ లో చదువు పూర్తయిన తర్వాత పెద్ద సిటీకి వెళ్లాలని అనుకున్నా. అప్పుడు నా ఛాయిస్ బెంగుళూరు, ముంబై. ఈ రెంటింటిలో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలా అనుకున్నప్పుడు కాయిన్ తో టాస్ వేశాను. ముంబై ఛాయిస్ గా వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లా. నా లైఫ్ మొత్తం మారిపోయింది' అని శోభిత చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కమల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement