సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రెగ్యూలర్‌గా తన అభిమానులతో టచ్‌లోనే ఉంటారు. అందుకు వేదికగా సోషల్‌మీడియాను ఎంచుకున్న ఆమె తరచూ పలు పోస్టులు పెడుతూ ఉంటారని తెలిసిందే. అలా ఎప్పుడు నెట్టింట ఆమె పేరు వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే, తాజాగా సమంత ఒక సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆమె కేవలం ఫోటో మాత్రమే షేర్ చేసినా ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది.
ఫొటోలో స్వెట్ షర్ట్ ధరించి సమంత ఉన్నారు. కళ్లకు బ్లాక్ గ్లాసెస్‌తో చాలా అందంగా కనిపిస్తున్నారు. అయితే , షర్ట్‌పై రాసున్న కొటేషన్ నెజన్లను ఆకర్షిస్తుంది. ఆమె వేసుకున్న షర్ట్ పై రాసి ఉన్న అక్షరాలతోపాటు ఆమె తలకు అలా చేయి ఆనించి తన మిడిల్ ఫింగర్ చూపించిందంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'శాంతి, నిశ్శబ్దాల మ్యూజియం' అని రాసి ఉన్నా కొటేషన్‌కు 'Now We Are Free' అనే సాంగ్‌ను కూడా ఆమె కలిపారు.
తన తల వద్ద చేతిని ఉంచిన సమంత మిడిల్ ఫింగర్‌ను మాత్రమే ఇండికేట్ చేస్తూ ఫోజు ఇచ్చింది. ఇప్పుడు అందరి కళ్లూ ఆమె వేలివైపే వెళ్లాయి. సమంత ఎవరిని ఉద్దేశించి ఆ కొటేషన్, ఫింగర్‌ను చూపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక్క ఫోటోతో అన్నింటికీ సమంత క్లారిటీ ఇచ్చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్వీన్స్ ఎప్పటికీ ఇలాగే సమాధానం చెప్తారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత షేర్ చేసిన తొలి ఫొటో ఇదే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment