Trinetra Playing a Trans Woman Working With the Team of Made in Heaven - Sakshi
Sakshi News home page

Made In Heaven: 'మేడ్ ఇన్ హెవెన్' లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా త్రినేత్ర..!

Published Tue, Aug 1 2023 7:26 PM | Last Updated on Tue, Aug 1 2023 7:35 PM

Trinetra playing a trans-woman working with the team of Made In Heaven - Sakshi

తెలుగమ్మాయి శోభిత ధూళిపాల తారాఖన్నాగా నటించిన వెబ్‌ సిరీస్‌ 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌'. ఈ సిరీస్‌లో శోభిత నటించిన తారా అనే వెడ్డింగ్‌ ప్లానర్‌ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. 2019 మార్చి 8న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైందీ సిరీస్‌. నిత్యా మెహ్రా, జోయా అఖ్తర్‌, ప్రశాంత్‌ నాయర్‌, అలంకృత శ్రీవాత్సవ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. అద్భుతమైన ట్విస్ట్‌తో మేకర్స్‌ ఈ సిరీస్‌ను ముగించారు.  రెండో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేడ్ ఇన్ హెవెన్ సీజన్‌-2 ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌ ఆగస్టు 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో  స్ట్రీమింగ్ కానుంది.

(ఇది చదవండి: 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2' ఓటీటీ డేట్‌ వచ్చేసింది, ఎప్పటినుంచంటే?)

అయితే సినీ విమర్శకుల ప్రశంసలు పొందిన వెబ్‌ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్'. అయితే సీజన్‌-2కు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ట్రైలర్‌ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరైన నటి స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు. ఈ వెబ్ సిరీస్‌ ద్వారా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది ఆమె. ఇంతకీ ఎవరామె? ఎందుకంత స్పెషల్‌ అనేది ఓసారి తెలుసుకుందాం. కాగా.. తొలి సీజన్‌లో ఉన్న శోభిత, అర్జున్‌, కల్కి కొచ్లిన్‌, జిమ్‌ సారబ్‌, శశాంక్‌ అరోరా, శివంగి రాస్తోగి సహా తదితరులు సీక్వెల్‌లోనూ నటించారు. అయితే ఇష్వాక్‌ సింగ్‌, త్రినేత్ర వంటి కొత్తముఖాలు కూడా సీక్వెల్‌లో కనిపిస్తాయి. ఇందులో కొత్తగా త్రినేత్ర ఈ సీజన్‌లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారనుంది. 

అసలు త్రినేత్ర ఎవరు?
త్రినేత్ర మరెవరో కాదు.. తొలిసారి నటనా రంగ ప్రవేశం చేయబోతున్న కర్ణాటక తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్. ఆమె అసలు పేరు త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు. ఈ వెబ్ సిరీస్‌లో మేడ్ ఇన్ హెవెన్' కంపెనీలో వెడ్డింగ్ ప్లానర్‌ల బృందంతో కలిసి పనిచేసే మహిళగా ట్రాన్స్-ఉమెన్‌గా కనిపించనుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్‌కు ఈవెంట్‌కు హాజరైన ఆమె తన పాత్ర పట్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ పాత్రను మొదట విన్నప్పుడు చేయలేకపోతానని భయమేసిందని తెలిపారు. మేడ్ ఇన్ హెవెన్- 2 ప్రారంభం మాత్రమేనని వెల్లడించింది. తాను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే ఈ  పాత్ర కోసం ఆడిషన్ జరిగినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తాను నటనపైనే పూర్తిగా దృష్టి సారించినట్లు తెలిపింది.

త్రినేత్ర మాట్లాడుతూ..'అప్పట్లో నేను ఇంటర్న్‌షిప్ చేస్తున్నందున ఇది నాకు కొంచెం భయంగా అనిపించింది. కానీ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు సాధించగలనని అనుకున్నా. ఎందుకంటే ఇది ట్రాన్స్-ఉమెన్‌గా నాకు చాలా దగ్గరి పాత్రలా ఉంది. ఈ సిరీస్‌లో చిత్రబృందం తనకు మద్దతుగా నిలిచారని ప్రశంసించింది. వారితో తన అనుబంధం మరిచిపోలేనిది. ఇప్పుడు నాకు ఒక కల నిజమైంది.' అని ఆమె పంచుకుంది.

(ఇది చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement