బాలనటుడిగా ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన అలీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచారు. తాజాగా ఈ స్టార్ కమేడీయన్.. హాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు జగదీష్ దానేటి దర్శకత్వంలో అలీ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను చిత్రబృందం మీడియాకు వెల్లడించింది. ఒక స్ట్రయిట్ హాలీవుడ్ చిత్రం చేస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్ దానేటి అని తెలిపింది. ఈ ఇండో హాలీవుడ్ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్ ఫిల్మ్స్, పింక్ జాగ్వర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు చెప్పింది.
మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ అనుమతుల విషయమై నటుడు అలీ, దర్శకుడు జగదీష్.. సమాచార, ప్రసారల శాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిశారు. అనంతరం అలీ మాట్లాడుతూ.. ‘హాలీవుడ్ సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉంది. హాలీవుడ్ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను. మంత్రి ప్రకాష్ జవదేకర్‌గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు. జగదీష్ మాట్లాడుతూ.. ‘ఇండో హాలీవుడ్ సినిమాల్లో ఇదో ఉదాహరణగా నిలిచే చిత్రమవుతుంది. అలీ గారిని హాలీవుడ్‌లో పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment