హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అంటోన్న సమంత! | Samantha Ruth Prabhu to make her Hollywood debut | Sakshi
Sakshi News home page

Samantha: హాలీవుడ్ ఎంట్రీకి సమంత రెడీ!

Nov 4 2023 7:40 AM | Updated on Nov 4 2023 8:28 AM

Samantha Ready To Become Entry Into Hollywood Movies - Sakshi

ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే లక్ష్యం తీరాలు చేరుకోవచ్చనే నానుడి నటి సమంతకు సరిగ్గా సెట్ అవుతుంది. హీరోయిన్‌గా ఈ చైన్నె భామ పయనం పూలబాటేమీ కాదు. ఆదిలో ఆశలు, అడియాశల సంగమంగానే సమంత సినీ జీవితం సాగింది. అలా తమిళ చిత్రాలతో సాదాసీదాగా సాగిన సమంత నట జీవితాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా మార్చేసింది. తెలుగులో తొలి చిత్రం ఏమాయ చేశావే అనూహ్య విజయాన్ని సాధించి సమంతను క్రేజీ హీరోయిన్‌ను చేసేసింది. 

ఆ తరువాత బృందావనం, దూకుడు వంటి చిత్రాలు స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టాయి. అలా అక్కడ తొలి చిత్రం హీరో నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి వంటి జీవితంలో ఆనందకరమైన ముఖ్య ఘట్టాలు చకచకా జరిగాయి. అంతా సంతోషం అయితే జీవితం ఎలా అవుతుంది. నాగచైతన్యతో మనస్పర్థలు, విడిపోవడం వంటి పెద్ద కుదుపునకు సమంత గురైంది. ఆ చేదు అనుభవాలను మరచిపోకముందే మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధి సమంతని తాకింది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అనుకుందో ఏమో సమంత ఆ వ్యాధితోనూ గట్టిగానే పోరాటం చేసింది. ప్రస్తుతం ఈ పోరాటంలో విజయవంతం అయ్యారనే చెప్పాలి.

తాజాగా సమంత ఇప్పుడు నేను రెడీ మళ్లీ వస్తున్నా అంటూ ఇన్‌స్ట్రాగామ్‌ పోస్ట్‌ చేశారు. ఎంతక్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఒక పక్క వైద్యం కోసం దేశాల బాట పడుతూనే.. మరో పక్క యోగాలు, వ్యాపారాలు అంటూ ఆధ్యాత్మిక పయనం చేస్తూ.. ఇంకో పక్క శారీరక వ్యాయామాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తను చేసే ప్రతి కార్యాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేస్తూ అభిమానులు తనను మర్చిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా తను వర్కౌట్స్‌ చేస్తున్న దృశ్యాలను, అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. కాగా ఈమె నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ త్వరలో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది. అదే విధంగా సమంత తమిళం, ఆంగ్ల భాషల్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంతో ఈమె హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement