నవంబర్‌కు ‘నో టైమ్‌ టు డై’ | No Time To Die Movie Postponed To November | Sakshi

నవంబర్‌కు ‘నో టైమ్‌ టు డై’

Mar 5 2020 2:01 PM | Updated on Mar 5 2020 2:18 PM

No Time To Die Movie Postponed To November - Sakshi

న్యూఢిల్లీ : జేమ్స్‌బాండ్‌గా డేనియల్‌ క్రేగ్‌ నటించిన ‘నో టైమ్‌ టు డై’ చిత్రం విడుదల తర్జనభర్జనల అనంతరం నవంబర్‌ నెలకు వాయిదా పడింది. ఈ చిత్రం బ్రిటన్‌లో ఏప్రిల్‌ రెండున, ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ పదవ తేదీన విడుదల కావాల్సి ఉండింది. కరోనా వైరస్‌ భయాందోళనల కారణంగా పలు దేశాల్లో థియేటర్లను మూసివేస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరి జోజి ఫుకునాగా దర్శకత్వం వహించిన ఈ చిత్రమే జేమ్స్‌బాండ్‌గా డేనియల్‌ క్రేగ్‌కు చివరిది. ఈ చిత్రాన్ని నవంబర్‌ 12వ తేదీన బ్రిటన్‌లో, నవంబర్‌ 25వ తేదీన అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర నిర్మాతలు మైఖేల్‌ జీ విల్సన్, బార్బర బ్రొకోలి ప్రకటించారు.

చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాల్లో ఇప్పటికే కరోనా భయాందోళనల వల్ల సినిమా థియేటర్లను మూసివేశారు. ఒక్క చైనాలో థియేటర్లను మూసివేయడం వల్ల ఇప్పటికే రెండు వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందట. పలు దేశాల్లో థియేటర్లను మూసివేయడం వల్ల దాదాపు 500 కోట్ల  డాలర్ల నష్టం వాటిల్లి ఉంటుందన్నది అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement