కామెడీ జేమ్స్‌బాండ్ | Allari Naresh Coming as James Bond | Sakshi
Sakshi News home page

కామెడీ జేమ్స్‌బాండ్

Published Thu, Apr 30 2015 11:21 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

కామెడీ జేమ్స్‌బాండ్ - Sakshi

కామెడీ జేమ్స్‌బాండ్

ఆ ఇద్దరూ భిన్న ధ్రువాల్లాంటివాళ్లు. అతగాడేమో మన్మథుడు తరహా. ఆవిడగారు మాఫియా డాన్ టైప్. ఇలా వ్యతిరేక మనస్తత్వాలున్న ఓ జంట కాపురం ఎలా సాగింది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘జేమ్స్ బాండ్’. ‘అల్లరి’ నరేశ్, సాక్షీ చౌదరి జంటగా సాయికిశోర్ మచ్చ దర్శకత్వంలో రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ నెల 12న పాటలనూ, మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామనీ అనిల్ సుంకర తెలిపారు. మన్మథుడిలాంటి భర్త, పవర్‌ఫుల్ మాఫియా డాన్ వంటి భార్య ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తారనీ, యాక్షన్ మరియు కామెడీ ఎంటర్‌టైనర్ ఇదనీ దర్శకుడు అన్నారు.  ఈ చిత్రానికి సహ నిర్మాత: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిశోర్ గరికపాటి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement