చిక్కోల్లో జేమ్స్‌బాండ్ సందడి
పీఎన్ కాలనీ / శ్రీకాకుళం సిటీ: చిక్కోల్లో జేమ్స్‌బాండ్ చిత్ర యూనిట్ సోమవారం సందడి చేసింది. పట్టణంలోని మారుతీ థియేటర్‌ను ఉదయం సంద ర్శించి సినీ డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. హీరో,హీరోయిన్‌తో కరచాలనం కోసం యువతీయువకులు ఎగబడ్డారు. సెల్‌ఫోన్‌లతో ఫొటోలు తీసేం దుకు పోటీపడ్డారు. ప్రత్యక్షదైవం శ్రీ సూర్యనారాయణ స్వామి తమ ఇష్టదైవమని, అందుకే సినిమా విజయోత్సవ యాత్రకు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టినట్టు హీరో అల్లరి నరేష్ పేర్కొన్నారు. గతంలో సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంలో నటించినట్టు గుర్తు చేశారు. సినిమా విజయవంతం చే సిన ప్రేక్షక దేవుళ్లకు హీరోయిన్ సాక్షి చౌదరి, డెరైక్టర్ సాయికిషోర్ మచ్చ, నిర్మాత అనీల్ సుంకర్, మ్యూజిక్ ైడె రెక్టర్ సాయికార్తీక్, క మెడియన్ ప్రవీణలు కృతజ్ఞతలు తెలిపారు.
ఆదిత్యుడిని దర్శించుకున్న చిత్రయూనిట్
అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని జేమ్స్‌బాండ్ చిత్రయూనిట్ బృందం సభ్యులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను వివరించారు. అనివె ట్టి మండపంలో ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని నటీనటులకు అందించారు. అరసవల్లి దేవాలయం వద్ద జేమ్స్‌బాండ్ చిత్రయూనిట్‌ను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.
జంధ్యాలలోటు ఎవరూ పూడ్చలేనిది
దివంగత సినీ రచయిత, దర్శకుడు జంథ్యాల లేని లేటు పరిశ్రమలో ఎవరూ పూడ్చలేనిదని నటుడు అల్లరి నరేష్ పేర్కొన్నారు. అరసవల్లిలో విలే కరులతో ఆయన కాసేపు మాట్లాడారు. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ అంటే ఒక బ్రాండ్ ఉందన్నారు. అది ఎప్పుడూ ఒకేలా ఉంటుందన్నారు. ఆంధ్రాలోనూ, తెలంగాణాలోనూ జేమ్స్‌బాండ్ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్నట్లు చెప్పారు. సినిమా టైటిల్ నుంచి ముగింపు వరకు తన చిత్రంలో కామెడీకే తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఈ ఏడాది తాను మూడు చిత్రాల్లో నటిస్తున్నానని, వాటిలో హీరోలు మోహన్‌బాబు, విక్టరీ వెంకటేష్‌తో సరసన చేయడం ఆనందాన్నిస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా మంచి కథ దొరికితే సినిమా చేస్తామన్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డైరక్టర్ దగ్గర నుంచి టెక్నీషియన్ వరకు అనుకున్న రంగంలో రాణించాలన్నా, విజయం సాధించాలన్నా ఓపిక కలిగి ఉండాలని సూచించారు.