ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడి కన్నుమూత | James Bond director Guy Hamilton dies at 93 | Sakshi

ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడి కన్నుమూత

Apr 21 2016 7:57 PM | Updated on Sep 3 2017 10:26 PM

ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడి కన్నుమూత

ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడి కన్నుమూత

ఉత్తమ జేమ్స్‌ బాండ్ సినిమాలు తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు గాయ్‌ హమిల్టన్‌ కన్నుమూశారు.

ఉత్తమ జేమ్స్‌ బాండ్ సినిమాలు తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు గాయ్‌ హమిల్టన్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. 'బాండ్' హీరో సీన్‌ కానరీతో 'గోల్డ్ ఫింగర్', 'డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌' సినిమాలను రూపొందించిన ఆయన రోజర్ మూర్‌తో కలిసి 'లివ్ అండ్ లెట్ డై', 'ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్‌' వంటి జేమ్స్‌ బాండ్ సినిమాలను అందించాడు. హమిల్టన్ మృతిపై బాండ్ హీరో రోజర్ మూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వండర్ ఫుల్ డైరెక్టర్ అయిన హమిల్టన్ చనిపోవడం ఎంతో బాధ కలిగిస్తున్నదని, అత్యద్భుతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారని ఆయన అన్నారు.

బాండ్ సినిమాలతోపాటు పలు ప్రముఖ బ్రిటిష్‌ చిత్రాలకు హమిల్టన్ దర్శకత్వం వహించాడు. 'బ్యాటల్ ఆఫ్ బ్రిటన్‌', 'ఫునెరల్ ఇన్ బెర్లిన్', ఫోర్స్‌ 10'తోపాటు అగాథా క్రిస్టీ రచనల ఆధారంగా తీసిన 'ద మిర్రర్ క్రాక్‌డ్‌', 'ఈవిల్ అండర్ ద సన్‌' చిత్రాలను తెరకెక్కించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement