బాండ్.. జేమ్స్ బాండ్.. అనే ఈ ఒక్క డైలాగ్ చాలు బాండ్ అభిమానులను విజిల్స్ వేయించడానికి. ఆ డైలాగ్‌లో ఏదో మత్తు ఉందని తెగ సంబరపడిపోతారు. జేమ్స్ బాండ్ మూవీ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్‌గా కోట్లలో అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. అంతలా ఈ మూవీ సిరీస్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ మూవీస్‌లో ఏజెంట్ 007 చేసే సాహసకృత్యాలు ప్రతి ఒక్కరినీ ఔరా అనిపిస్తాయి. ఇక హీరోయిన్స్‌తో బాండ్ చేసే రొమాన్స్ గురించి చెప్పక్కర్లేదు. రీసెంట్‌గా డానియల్ క్రేగ్ నటించిన నో టైమ్ టు డై మూవీతో ఇప్పటివరకు 25 బాండ్ చిత్రాలు వచ్చాయి. హాలీవుడ్‌లో వచ‍్చిన ఈ సినిమాల‍్లో మొత్తం ఏడుగురు యాక్టర్స్ బాండ్ క్యారెక్టర్‌ను పోషించారు. అయితే మన తెలుగు వాళ్లకు జేమ్స్ బాండ్ అంటే మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకువస్తారు. ఏజెంట్ 116 పాత్రలో ఆయన అద్భుతంగా ఒదిగిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116తో పాటు తెలుగులో వచ్చిన బాండ్ చిత్రాలపై ఓ స్టోరీ చూసేద్దామా..!
1. గూఢచారి 116
తెలుగులో వచ్చిన మొదటి జేమ్స్ బాండ్ చిత్రం. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, జయలలిత హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేయగా మల్లికార్జున రావు దర్శకత్వం వహించారు. పలు నేరాలకు సాక్ష్యాలైన ఫొటో ఎవిడెన్స్ కోసం సీక్రెట్ ఏజెంట్ 303ను ఇంటర‍్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ హత్య చేస్తుంది. ఈ కేసును చేధించడానికి ఏజెంట్ 116కు సీఐడీ అప్పగిస్తుంది. దానిని ఏజెంట్ 116 ఎలా చేధించారు, ఆ ఫొటోలో ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయనేది సినిమా కథ.
2. గూఢచారి నెం. 1
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన గూఢచారి నెం.1లో మెగస్టార్ చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1983లో విడుదలై మంచి హిట్ టాక్ అందుకుంది. నెంబర్ 1 అనబడే ఒక ప్రభుత్వ ఏజెంట్ దేశద్రోహుల్ని ఎలా పట్టుకున్నాడనేదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో మెగస్టార్ చిరంజీవి తొలిసారిగా గూఢచారి పాత్ర పోషించారు.
3. విశ్వరూపం
‘విశ్వరూపం’ సినిమాలో కమల్... భారత్ జేమ్స్‌బాండ్‌గా ఏ రకంగా నట విశ్వరూపం చూపించాడో తెలిసిందే. 60 ఏళ్ల వయసులో కమల్ ఈ మూవీ కోసం చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా విడుదలైన ‘విశ్వరూపం2’ మాత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోలేకపోయింది. గతంలో కమల్ హాసన్ కొన్ని సినిమాల్లో జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో నటించారు.
4. గూఢచారి
అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రం 2020లో విడుదలైంది. ఇది పూర్తిగా జెమ్స్ బాండ్ తరహాలో వచ్చిన ఈ చిత్రంలో తన నటనతో అడవి శేష్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితం దక్కించుకుంది ఈ చిత్రం. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా గూఢచారి 2 ను తెరకెక్కిస్తున్నారు.
5. చాణక్య
గోపిచంద్ హీరోగా నటించిన చిత్రం చాణక్య. ఇందులో గోపిచంద్ రా ఏజెంట్‌గా మెప్పించారు. ఈ సినిమాకు అబ‍్బూరి రవి కథ రాయగా డైరెక్టర్ తిరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
చదవండి: జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్‌కి అరుదైన గౌరవం
ఇవే కాకుండా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో డార్లింగ్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని జేమ్స్ బాండ్ తరహాలో రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక డార్లింగ్‌ను సీక్రెట్ ఏజెంట్ పాత్రలో చూస్తే ప్రభాస్ అభిమానులకు పండగే. మరోవైపు ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న రాజా విక్రమార్క చిత్రం కూడా సీక్రెట్ ఏజెంట్ కథాంశంతోనే నవంబర్ 12న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment