
జేమ్స్‌బాండ్ ఫేమ్ నడ్జా రెజీన్ (87) ఇకలేరు. ఆమె మృతిచెందినట్లు జేమ్స్‌బాండ్ అధికారిక ట్వీటర్‌పేజీలో పోస్ట్ చేశారు ‘జేమ్స్‌బాండ్’ ఫ్రాంచైజీ ప్రతినిధులు. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వచ్చిన ‘‘ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్‌ఫింగర్’ చిత్రాల్లో నటించిన నడ్జా రెజీన్ కన్నుమూశారని తెలియజేయడానికి బాధపడుతున్నాం. రెజిన్ ఆత్మకు శాంతి కలగాలి. ఈ బాధాకర సమయంలో ఆమె కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం’’అని జేమ్స్‌బాండ్ ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సెర్బియాలో 1931 డిసెంబర్ 2న జన్మించారు నడ్జా రెజీన్. బెల్‌గ్రేడ్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత కొన్ని టీవీషోలు కూడా చేశారు. ద మ్యూజిక్ స్వార్డ్ (1950), ద మ్యాన్ వితవుట్ బాడీ (1957), సోలో ఆఫ్ స్పారో (1962) రెజిన్ నటించిన మరికొన్ని చిత్రాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా రెజీన్ తుది శ్వాస విడిచారు.