అక్రమ నిర్బంధంలో ఉన్న వారిని అరెస్ట్ చూపించిన పోలీసు శాఖ..
సంబంధిత మేజిస్ట్రేట్‌ల ముందు హాజరు
ఈ వివరాలను హైకోర్టుకు నివేదించిన పోలీసులు
సీసీ ఫుటేజీలను మేజి్రస్టేట్‌లకు ఇవ్వాలని పోలీసులకు స్పషీ్టకరణ.. పలువురు ఎస్‌హెచ్‌వోలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చిన హైకోర్టు
రమణను తమ ముందు హాజరుపరచాలని దర్శి పోలీసులకు ఆదేశం
సాక్షి నెట్‌వర్క్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వదలలేదు. వ్యూహం సినిమా నిర్మించే క్రమంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిలను కించపరిచేలా పోస్టింగ్ పెట్టారన్న ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
వివేకానందరెడ్డి సినిమాను దారుణంగా తీసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై డైరెక్టుగా ఎన్నో అభాండాలు వేస్తూ యూట్యూబ్‌లోనూ, ఇతర ప్రసార మాధ్యమాలలోనూ చేసిన ప్రచారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. సెన్సార్ బోర్డు పర్మిషన్ తీసుకుని సినిమా తీసిన ఆర్జీవీపై వ్యక్తిగతంగా కేసు పెట్టడంపై సినిమా వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరి సెన్సార్ బోర్డు ఉన్నది దేనికి అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వ్యక్తిగతంగా కేసులు పెట్టడం దుర్మార్గమని సినిమా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద మద్దిపాడు పోలీసులు 336/4, 356/4, 196/356, ఐటీ/67 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment