కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది (ఫైల్‌ఫోటో)
సాక్షి, ముంబై : తన పదేళ్ల బాలికపై లైంగిక దాడి జరుపుతామంటూ ట్విటర్ వేదికగా హెచ్చరిస్తూ ట్రోల్ చేస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరీష్‌కే1605 ట్విటర్ ఖాతా నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయని ఆమె చెప్పారు. దీనిపై తాను గోరెగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చతుర్వేది చెప్పారు. శ్రీరాముడి ప్రొఫైల్ పిక్‌ను పెట్టుకున్న సదరు ట్విటర్ యూజర్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడంలో వెనుకాడలేదని ఆమె ట్వీట్ చేశారు.
ముంబై పోలీసులు తన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, సమాజంలో చెడు ఉన్నట్టే మంచి కూడా ఉందని అన్నారు. కాగా చతుర్వేది కుమార్తెకు ఈ తరహా హెచ్చరికలు చేయడాన్ని ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై చట్టప్రకారం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ అంశంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment