సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కంప్యూటర్లను కనిపెట్టడం, మళ్లీ వాటిని ఆవిష్కరించడంలో రేవంత్ బిజీగా ఉన్నారని విమర్శలు గుప్పించారు. దీంతో పాటు ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై ఉన్నారని కేటీఆర్ సెటైర్లు వేశారు. అయితే సీఎం తన విధులను విస్మరిస్తున్నారని.. ఎవరైనా ఒక్కరు ఈ ‘పాలమూరు బిడ్డ’కు గుర్తు చేయాలన్నారు..
ఇటీవల సెప్టెంబర్3న సంభవించిన వరదలకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులోని వట్టెం పంపు హౌస్ నీట మునిగినప్పటికీ సీఎం రేవంత్ ఇప్పటి వరకు స్పందించలేదు. వరద నీటికి బాహుబలి మోటార్లు నీట మునిగాయి. ఇప్పటి వరకు కేవలం ఒక మీటర్ నీటిని మాత్రమే తొలగించారు.. మరో 18 మీటర్ల నీటిని అలానే ఉంచారు. ఆ నీటిని కూడా త్వరగా తొలగించాలి. తెలంగాణకు ముఖ్యమైన, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులను ఎందుకు ధ్వంసం చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
While CM Revanth Reddy was busy discovering and rediscovering the origins of computers and while he is busy boarding flights to appease Delhi bosses, someone should remind him this ‘Palamuru Bidda’ that he is vastly ignoring his duties!
The recent flooding at the Vattem pump… pic.twitter.com/grdpwyN8t9— KTR (@KTRBRS) September 18, 2024
Comments
Please login to add a commentAdd a comment