
సాక్షి,హైదరాబాద్: హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌లో సొంతింటి కలలు కలగానే మిగిలిపోయాయని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ సోమవారం(అక్టోబర్ 28) ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.‘నీ మూసి ముష్ఠి పనులకు కొత్తగా కట్టేటోడు లేక కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులా మారింది. నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్నా ఉన్నవి అమ్మాలన్నా దిక్కు లేకుండా పోయింది.
కాసులపై నీ కక్కుర్తి నిర్ణయాలు తెలంగాణను అధోగతిపాలు చేస్తున్నాయి. నాడు నిత్యం కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నేడు విలవిలలాడుతున్నాయి. పదినెలల కాంగ్రెస్ పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమే’అని కేటీఆర్ ట్వీట్‌లో దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: ఉపాధ్యాయులూ మేల్కొనండి
సంపద పెంచే ఆలోచనలు మావి - ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి
మేము బంగారు బాతును చేతిలో పెడితే- మీరు పదినెలలకే చిప్ప చేతిలో పేడితిరి
నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న - పాతవి అమ్మాలన్న భయమే
నీ హైడ్రా దెబ్బకు హైద్రాబాద్ లో సొంతింటి కలలు కలగానే మిగిలిపాయే
నీ మూసి ముష్ఠి… pic.twitter.com/W2bhQMBFSy— KTR (@KTRBRS) October 28, 2024
Comments
Please login to add a commentAdd a comment