
ముంబై : బీజేపీ, బాలీవుడ్ పరిశ్రమపై శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శనాస్థ్రాలు సంధించారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చిన వారిని బీజేపీ సమర్ధిస్తోందని విమర్శించారు. ఆ నటి (కంగనా రనౌత్) ముంబైని పీఓకేతో పోల్చితే ఏ ఒక్కరూ మాట్లాడలేదని రౌత్ మండిపడ్డారు. కాగా ముంబైను విమర్శించిన కంగనా వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు.
ముంబై నగరం బాలీవుడ్ నటులకు డబ్బుతో సహా కావాల్సినవన్ని సమకూర్చుంది. కానీ నగరం కేవలం వారికి డబ్బులు సంపాదించేందుకేనా అని బాలీవుడ్ పరిశ్రమను ఉద్దేశించి ప్రశ్నించారు. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌పుత్, క్షత్రియ ఓట్లను ఆకట్టుకోవడం కోసమే బీజేపీ ప్రయత్నమని సంజయ్ రౌత్ ఆరోపించారు.