![Sanjayraut Comments On Nitish Kumar Chandrababau Naidu](/styles/webp/s3/article_images/2024/06/5/sanjayraut.jpg.webp?itok=yXLZApOT)
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏలో కీలకంగా మారిన నితీశ్‌కుమార్, చంద్రబాబులపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్‌రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో జరిపే భేటీకి సంజయ్‌రౌత్ బయలుదేరారు. సందర్భంగా రౌత్ మీడియాతో మాట్లాడారు.
‘బీజేపీకి మెజారిటీ ఎక్కడుంది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, నితీశ్‌కుమార్ అందరికీ స్నేహితులే.
ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసేవారికి వారు మద్దతిస్తారని నేను అనుకోను. అయితే ఎన్నికలకు ముందే వారు బీజేపీతో కలిసి పోటీ చేసినందున వారు ఎన్డీఏ సంకీర్ణంలో కొనసాగే అవకాశాలే ఉన్నాయి
సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే శక్తి మోదీకి లేదు. ఆయన ఇంకా తన వైఖరినీ వీడలేదు. మోదీ సర్కార్, మోదీగ్యారెంటీ అని మాట్లాడుతున్నారు’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment