Sanjay Raut.. మహారాష్ట్రలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఆదివారం ఉదయం ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. పత్రాచల్ భూ స్కాం కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే, సంజయ్ రౌత్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా.. పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులే ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని రౌత్ ఇంటికి వచ్చి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో సీఆర్‌పీఎఫ్ బలగాలు మోహరించాయి.
మరోవైపు.. సంజయ్ రౌత్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ఈడీ భయపడను అంటూ కామెంట్స్ చేశారు. ఏప్రిల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా మిస్టర్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
ED Arrives at Sanjay Raut’s Mumbai Home for Questioning After Earlier No-Show https://t.co/WmDw6CS7xk
— HuntdailyNews (@HUNTDAILYNEWS1) July 31, 2022
ఇది కూడా చదవండి: హోంమంత్రి ఇంటిపై ఏబీవీపీ కార్యకర్తల దాడి!
Comments
Please login to add a commentAdd a comment