Sanjay Raut Claims Rs 2000 Crore Deal To Purchase Shiv Sena Name And Symbol - Sakshi
Sakshi News home page

శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం రూ.2,000 కోట్ల డీల్‌: సంజయ్‌ రౌత్‌

Published Sun, Feb 19 2023 2:35 PM | Last Updated on Sun, Feb 19 2023 4:43 PM

'రూ.2000 కోట్లు ఖర్చు చేసి శివసేన పార్టీ పేరు, గుర్తును కొన్నారు' - Sakshi

ముంబై: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని కొనుగోలు చేసేందుకు రూ.2,000 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అసలైన శివసేన ఎక్‌నాథ్‌ షిండేదే అని ఎన్నికల సింగం నిర్ణయం తీసుకోవడం ఓ ఒప్పందంలో భాగంగానే జరిగిందని అన్నారు. ఈ వ్యవహారంలో రూ.2,000 కోట్ల లావాదేవి జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని చెప్పారు.

ఈ లావాదేవి గురించి అధికార పార్టీతో సన్నిహత సంబంధాలు ఉన్న ఓ బిల్డర్ తనకు చెప్పారని రౌత్ పేర్కొన్నారు. ఈమేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

'ఒక ఎమ్మెల్యేను కొనడానికి రూ.50 కోట్లు, ఒక ఎంపీని కొనడానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు.  మా కౌన్సిలర్‌ని, శాఖా ప్రముఖ్‌ని కొనడానికి రూ.కోటి వెచ్చిస్తున్న ఈ ప్రభుత్వం, నాయకుడు, నీతిలేని వ్యక్తుల సమూహం, మా పార్టీ గుర్తును, పేరును కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు చేయగలరో నేను ఊహించగలను. నా అంచనా ప్రకారం అది రూ.2,000 కోట్లు' అని రౌత్ ఆరోపించారు.

చదవండి: ఇంటిపై నుంచి రూ.500 నోట్ల వర్షం.. తీసుకునేందుకు ఎగబడ్డ జనం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement