ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే శివసేనకు చెందిన రెండు వర్గాల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు.. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నీవీస్‌కు భద్రత పెంచడంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఫడ్నవీస్ మీద ఇప్పుడేమైనా ఇజ్రాయెల్ లేదా లెబనాన్ దాడికి దిగుతున్నాయా? అని ప్రశ్నించారు.
మహారాష్ట్రలో ఎన్నికల వేళ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు అదనపు భద్రత పెంచుతున్నారనే సమాచారం వచ్చింది. ఫడ్నవీస్‌కు ప్రస్తుతం జెడ్ ప్లస్ భద్రత ఉండగా.. ఆయన కోసం అదనపు ఫోర్స్ వన్ కమాండోలను నాగపూర్‌లో ఉంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ భద్రతపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు.
ఈ సందర్బంగా రౌత్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు ఆకస్మికంగా భద్రతను పెంచడానికి కారణం ఏంటి?. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆయన.. తన కోసం భద్రతను పెంచుకోవడం ఏంటి?. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏం రక్షణ ఇస్తారు?. ఫడ్నవీస్ నివాసం వెలుపల ఫోర్స్ కమాండోలు నిలబడి ఉన్నారు. నాగపూర్ మరో 200 మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం ఎందుకు అంత భయపడుతున్నారు. ఆయనపై దాడి జరగబోతోందా..? అలా ఎవరు చేయాలనుకుంటున్నారు..? ఇజ్రాయెల్ లేదా లెబనాన్ ఏమైనా ఆయనపై దాడికి దిగుతున్నాయా..? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో భద్రతను పెంచడంపై ఫడ్నవీస్, డీజీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఉద్దవ్‌థ్రాకే శివసేన వర్గం పట్టుదలతో ప్రచారంలో బిజీ ఉంది.
#WATCH | Mumbai: Shiv Sena (UBT) Sanjay Raut says "The Home Minister of this state, who is a former Chief Minister (Devendra Fadnavis), has suddenly increased his security. The Home Minister gives security to others but he increased his own security. Suddenly we saw Force One… pic.twitter.com/yvDaJwNBIp
— ANI (@ANI) November 3, 2024
Comments
Please login to add a commentAdd a comment