సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ ట్యాపింగ్ కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది.ముఖ్యంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రేగినప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నేతల్లో ఆందోళనకు దారి తీసింది. దీనిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేయగా, శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై మండిపడ్డారు. ముఖ్యులు, జర్నలిస్టుల ఫోన్ కాల్స్‌పై ఒక విదేశీ సంస్థ నిఘా చాలా తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. అంతేకాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఫోన్ కూడా ట్యాప్ చేసినా ఆశ్యర్యం లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేతో చర్చించినట్లు రౌత్ చెప్పారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది.
ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసాస్ ద్వారా జర్నలిస్టులతో సహా పలువురు ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై శివసేన ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలనా బలహీనతకు ఇది నిదర్శమని ఢిల్లీలో విలేకరులతో వ్యాఖ్యానించారు. దీనిపై భయానక వాతావరణం ఉందనీ, తక్షణమే ప్రధాని, హోంమంత్రి క్లారిటీ ఇవ్వాలని కోరారు. మహారాష్ట్రలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ లేవనెత్తారన్నారు. ఇందులో సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారన్న ఆరోపణలపై తాము దర్యాప్తు చేపట్టామని గుర్తు చేశారు. మరోవైపు రాహుల్‌గాంధీ సహా ఇతర నేతలపై హోంమంత్రి స్నూపింగ్‌కు పాల్పడుతున్నారని మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని, దీనికంటే ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదవినుంచి తప్పుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. కాగా పెగాసస్ ట్యాపింగ్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆశ్చర్యం
Comments
Please login to add a commentAdd a comment