spying issue
-
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన వారి విడుదలకు ప్రయత్నాలు: జైశంకర్
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళ మాజీ అధికారులను విడిపించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం జైశంకర్ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలను ఈ ఉదయం కలిశాను. ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వారికి తెలియజేశా. బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన, బాధలను తెలుసుకున్నాం. ఉరిశిక్ష పడిన ఎనిమిది మంది అధికారుల విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని భరోసా ఇచ్చాం. ఆ విషయంలో వారి కుటుంబాలతో సమన్వయం చేసుకుంటాం’ అని ఎక్స్ (ట్విటర్) వేదికగా జైశంకర్ పేర్కొన్నారు. Met this morning with the families of the 8 Indians detained in Qatar. Stressed that Government attaches the highest importance to the case. Fully share the concerns and pain of the families. Underlined that Government will continue to make all efforts to secure their release.… — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 30, 2023 కాగా గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన ఎనిమది మంది మాజీ అధికారులకు మరణశిక్ష విధిస్తూ ఇటీవల ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న భారత నావికాదళ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్‌లపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వీరంతా ఇజ్రాయెల్ తరపున ఓ సబ్‌మెరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలపై సదరు అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకుంది. దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పుతో దిగ్భ్రాంతికి గురయ్యాయమని తెలిపింది. ఈ సమస్యను ఖతార్ అధికారులతో తేల్చుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటున్నామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించింది. -
నేను అప్పుడే చెప్పినా..పట్టించుకోలేదు: అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ వైరల్
సాక్షి, హైదరాబాద్: గూఢచర్య ఆరోపణలతో భారత నేవీకి చెందిన ఎనిమిది మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మాజీ నావికాదళ అధికారులు ఇపుడు మరణం అంచున ఉండటం దురదృష్టకరమంటూ ఆయన ట్వీట్ చేశారు. (భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష!) ఖతార్‌లో చిక్కుకున్న నావికాదళ మాజీ అధికారుల సమస్యను ఆగస్టులో పార్లమెంట్లో లేవనెత్తినట్లు ఒవైసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఇస్లామిక్ దేశాలు తనను ఎంతగా ప్రేమిస్తున్నాయని గొప్పగా చెప్పుకునే ప్రధాని మోదీ మరణశిక్షను ఎదుర్కొంటున్న మన మాజీ నావికాదళ అధికారులను వెంటనే వెనక్కి తీసుకురావాలని ఒవైసీ డిమాండ్ చేశారు. కాగా ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే అనుమానంతో ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టులోఘీ ఎనిమిది మంది అధికారులను ఖతార్అదుపులోకి తీసుకుంది. వీరికి ఖతార్ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సాధ్యమయ్యే అన్ని చట్టపరమైన చర్యలను అన్వేషిస్తున్నట్లు ప్రకటించింది. In August, I had raised the issue of our ex-naval officers stuck in #Qatar. Today they have been sentenced to death. @narendramodi has boasted about how much “Islamic countries” love him. He must bring our ex-naval officers back. It’s very unfortunate that they face the death row pic.twitter.com/qvmIff9Tbk — Asaduddin Owaisi (@asadowaisi) October 26, 2023 -
మీ మొబైల్ భద్రమా? ఉన్నట్టుండి బ్యాటరీ డౌన్, తెలియకుండానే డాటా ఖతం!
రోజురోజుకి టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మనకు కావాల్సిన సమాచారం మొత్తం మన చేతిలో (స్మార్ట్‌ఫోన్‌లో) ఉంచుకుంటున్నాము. అయితే కొంతమంది మన సమాచారాన్ని తెలుసుకోవడానికి హ్యాక్ చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువైపోయింది. మన ఫోన్లో మన ప్రమేయం లేకుండా మనకు సంబంధించిన సమాచారం ఎవరైనా చూస్తున్నారా?.. లేదా.. అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. తెలియని అప్లికేషన్లు (Unfamiliar Applications): ఆధునిక కాలంలో స్పైవేర్ ఇతర వ్యక్తులను గురించి తెలుసుకోవడానికి ప్యారంటల్ కంట్రోల్ యాప్స్ ఉపయోగించుకుంటారు. ఈ యాప్‌లలో ఒకదానిని ఉపయోగించి ఎవరైనా మీ ఫోన్లో స్పై చేస్తుంటే తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి డౌన్లోడ్ చేసినట్లు మీకు గుర్తులేని ఏవైనా తెలియని అప్లికేషన్ల కోసం మీ ఫోన్లో సర్చ్ చేయవచ్చు. దీనికోసం నెట్ నానీ, కాస్పెర్స్కీ సేఫ్ కిడ్స్, నార్టన్ ఫ్యామిలీ యాప్స్ ఉపయోగపడతాయి. పర్ఫామెన్స్లో సమస్యలు: స్పైవేర్ మీ డేటాను ఎప్పటికప్పుడు సేకరించుకుంటుంది. అయితే మునుపటికంటే మీ మొబైల్ పర్ఫామెన్స్ విషయంలో తగ్గితే వెంటనే దానికి కారణాలు తెలుసుకోండి. స్మార్ట్‌ఫోన్‌ను ఎలా వేగవంతం చేయాలనే దానిపై అరా తీయండి, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని శోధించండి. బ్యాటరీ త్వరగా ఖాళీ అవ్వడం: స్పైవేర్ నిరంతరం పని చేస్తుంటే, అది మీ బ్యాటరీని సాధారణం కంటే వేగంగా ఖాళీ చేస్తుంది. అయితే అన్ని బ్యాటరీలు క్రమంగా క్షీణిస్తాయి, అలా కాకుండా కారణం లేకుండా త్వరగా క్షీణించడం ప్రారంభమైతే దానికి కారణం తెలుసుకోండి. ముందుగా మీరు ఏదైనా కొత్త అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసారా? లేదా అప్డేట్ చేసారా చూడండి. కొన్ని యాప్స్ కూడా బ్యాటరీ త్వరలో ఖాళీ అవ్వడానికి కారణం అయ్యే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ వేడెక్కడం: మీ మొబైల్ చాలా వేగంగా వేడెక్కుతుంటే ఎవరో మీ మొబైల్ హ్యాక్ చేస్తున్నారని అనుమానించండి. తక్కువగా ఉపయోగించనప్పుడు లేదా అసలే ఉపయోగించకుండా ఉన్నప్పుడు వేడెక్కితుంటే తప్పకుండా దానికి కారణాలు తెలుసుకోండి. ఎక్కువ డేటా వినియోగం: మీ మొబైల్ ఫోన్లో అనుకోకుండా ఎక్కువ డేటా ఖాళీ అవుతుంటే స్పైవేర్ రన్ అవుతుందనే సంకేతం కావచ్చు. ఎందుకంటే నేరస్థుడు సమాచారాన్ని పొందటానికి యాప్ డేటాను ఉపయోగించాల్సి ఉంటుంది, కాబట్టి డేటా వినియోగంలో పెరుగుదల చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫ్ చేయడం లేదా రీస్టార్ట్ చేయడంలో సమస్యలు: నిజానికి మన ఫోన్ మనకు కావలసినప్పుడు షట్ డౌన్ చేసుకోవచ్చు, లేదా రీస్టార్ట్ చేసుకోవచ్చు. అయితే హ్యాకర్లు మన మొబైల్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆఫ్ చేయడం లేదా రీస్టార్ట్ చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. నేరస్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా మీ ఫోన్ ఉపయోగించాలి కాబట్టి యాక్సెస్ చేయడం జరుగుతుంది. సర్చ్ బ్రౌజర్ హిస్టరీ: మీ మొబైల్ ఫోన్లో ఎప్పటికప్పుడు బ్రౌజర్ హిస్టరీ చెక్ చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా అందులో ఫోన్ స్పై సాఫ్ట్వేర్ గురించి ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్పైవేర్‌ని డౌన్లోడ్ చేయడానికి మీ బ్రౌజర్‌ని ఎవరైనా ఉపయోగించే అవకాశం ఉంది. బహుశా అలా జరిగినప్పుడు హిస్టరీలో మనకు కనపడుతుంది. మొబైల్ ఫోన్లో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. స్పైవేర్ రిమూవ్ టూల్ ఉపయోగించండి: మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి స్పైవేర్‌ను తీసివేయడానికి రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి. ఇది స్పైవేర్ (మరియు ఇతర రకాల మాల్వేర్) కోసం మీ పరికరాన్ని స్కాన్ చేస్తుంది, అదే సమయంలో దానిని పూర్తిగా తీసివేస్తుంది. అయితే దీని కోసం భద్రత కలిగిన సాఫ్ట్వేర్ ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయండి: మొబైల్ ఫోన్ హ్యాక్ నుంచి తప్పించుకోవడానికి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయడం మంచిది. దీని ద్వారా పూర్తిగా తీసివేసే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ దాని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కావున దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపయోగించాలని సూచిస్తున్నాము. ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయండి: ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల స్పైవేర్ పూర్తిగా తొలగించబడుతుంది. ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ఫోన్లో ఉన్న అన్ని అంశాలు పోతాయి. మీరు ఏదైనా ఫోన్ తీసుకుంటే దానిని తప్పకుండా రీసెట్ చేయాలి. అంతే కాకుండా ఎప్పుడూ అనవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేయకుండా ఉండాలి. -
బెడ్రూం, వాష్‌రూంపై కూడా మోదీ సర్కార్ నిఘా: కాంగ్రెస్ ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: పెగాసెస్ ట్యాపింగ్ కుంభకోణంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడింది. రాజ్యాంగ కార్యనిర్వాహకులు, కేంద్ర మంత్రులు, సీనియర్ ప్రతిపక్ష నాయకులు, న్యాయ మూర్తులు, జర్నలిస్టులు, ఇతరుల సెల్ఫోన్లను అక్రమంగా హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తా కథనాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఘాటుగా స్పందించారు. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ పెగాసస్ ద్వారా మోదీ ప్రభుత్వం ఇక బెడ్ రూం సంభాషణలుకూడా వింటుందని ఆరోపించారు. బీజేపీ స్నూపింగ్‌కు పెట్టింది పేరనీ, అది భారతీయ జాసూసీ పార్టీ అంటూ విమర్శించారు. జాతీయ భద్రతను పణంగా పెట్టి విదేశీ కంపెనీకి డేటాను అప్పగించడమంటే కచ్చితంగా ఇది రాజద్రోహమే అని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవినుంచి తొలగించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. స్పైవేర్ పనితీరును, మన ఫోన్లను ఎలా ప్రభావితం చేస్తుందో లాంటి వివరాలపై కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా సోమవారం స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ తోపాటు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సెక్యూరిటీ కీలక అధికారులు, చివరికి మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఫోన్లపై కూడా నిఘా పెట్టడం సిగ్గు చేటన్నారు. అంతేకాదు ఇక మన కుమార్తె లేదా భార్య ఫోన్లను పెగాసస్ ద్వారా ట్యాప్ చేస్తుందన్నారు. వాష్రూమ్లోఉన్నా..పడకగదిలో ఉన్నా, మీ భార్యతోను, కుమార్తెతోనో మాట్లాడుతూ ఉన్నా.. ఆసంభాషణపై కూడా మోదీ ప్రభుత్వం నిఘా పెట్టగలదని సుర్జేవాలా విలేకరుల సమావేశంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్ఓ గ్రూపుకు చెందిన ‘పెగసస్’ అనే స్పైవేర్ టెర్రరిస్టు కార్యకలాపాలు, ఇతర నిఘా కార్యకలాపాల కోసం ఎన్ఎస్ఓ గ్రూప్ ప్రభుత్వ సంస్థలకు విక్రయిస్తుందని,ఇపుడువీరందరినీ టెర్రరిస్టులుగా భావిస్తున్నారా మండిపడ్డారు. అటు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాకూడాపెగాసస్ వ్యవహారంపై ట్విటర్ ద్వారా విమర్శలు గుప్పించారు.పెగసస్ నిఘా చాలా దారుణమన్నారు. రాజ్యాంగబద్ధంగా భారతీయ పౌరులకు ప్రాథమిక హక్కుగా లభించిన గోప్యతా హ్యక్కుపై మోదీ సర్కార్ తీవ్రమైన దాడిని ప్రారంభించినట్లు కనిపిస్తోందన్నారు. ఇది ప్రజల స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి తీరని అవమానమని ట్వీట్ చేశారు. కాగా ఫోన్ల ట్యాపింగ్ విషయాన్ని కేంద్రం తోసిపుచ్చింది. అటు స్పైవేర్ పెగాసస్ ద్వారా ప్రముఖుల ఫోన్లపై నిఘా వార్తలను ఎన్ఎస్ఓ గ్రూప్ కూడా తోసిపుచ్చింది.నిరాధార ఆరోపణలను చేసినందు వల్ల తాము పరువు నష్టం దావా వేయనునున్నట్టు వెల్లడించింది. पेगासस के जरिए जासूसी से जुड़े खुलासे बहुत ही घिनौनी कारगुजारियों की तरफ इशारा करते हैं। अगर ये सच है, तो मोदी सरकार संविधान द्वारा देशवासियों को दिए गए निजता के अधिकार पर गंभीर और खतरनाक हमला कर रही है। इससे लोकतंत्र तो नष्ट होगा ही, ये देशवासियों.. #Pegasus 1/2 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2021 -
ఉద్దవ్ ఠాక్రే ఫోన్ నెంబర్ ఉన్నా ఆశ్చర్యం లేదు: శివసేన
సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ ట్యాపింగ్ కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది.ముఖ్యంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రేగినప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నేతల్లో ఆందోళనకు దారి తీసింది. దీనిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేయగా, శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై మండిపడ్డారు. ముఖ్యులు, జర్నలిస్టుల ఫోన్ కాల్స్‌పై ఒక విదేశీ సంస్థ నిఘా చాలా తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. అంతేకాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఫోన్ కూడా ట్యాప్ చేసినా ఆశ్యర్యం లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేతో చర్చించినట్లు రౌత్ చెప్పారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసాస్ ద్వారా జర్నలిస్టులతో సహా పలువురు ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై శివసేన ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలనా బలహీనతకు ఇది నిదర్శమని ఢిల్లీలో విలేకరులతో వ్యాఖ్యానించారు. దీనిపై భయానక వాతావరణం ఉందనీ, తక్షణమే ప్రధాని, హోంమంత్రి క్లారిటీ ఇవ్వాలని కోరారు. మహారాష్ట్రలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ లేవనెత్తారన్నారు. ఇందులో సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారన్న ఆరోపణలపై తాము దర్యాప్తు చేపట్టామని గుర్తు చేశారు. మరోవైపు రాహుల్‌గాంధీ సహా ఇతర నేతలపై హోంమంత్రి స్నూపింగ్‌కు పాల్పడుతున్నారని మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని, దీనికంటే ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదవినుంచి తప్పుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. కాగా పెగాసస్ ట్యాపింగ్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆశ్చర్యం -
చిచ్చురేపిన గూఢచర్యం
దేశాల మధ్య ఉండే సంబంధాలు చిత్రమైనవి. పరస్పరం కత్తులు నూరుకునే దేశాలు మాత్రమే కాదు... స్నేహంగా ఉంటున్న దేశాలు సైతం అవతలి పక్షం తీరుతెన్నుల గురించి ఆరా తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అయిదేళ్ల క్రితం సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా దశాబ్దాలుగా శత్రు దేశాలపైన మాత్రమే కాదు... సన్నిహిత దేశాలపై కూడా ఎలా నిఘా పెట్టిందో బట్టబయలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు బ్రిటన్–రష్యాల మధ్య కొనసాగుతున్న పంచాయతీ అలాంటి గూఢచార కార్యకలాపాల పర్యవసానమే. రష్యా సైనిక ఇంటెలిజెన్స్ కల్నల్‌గా పనిచేసిన సెర్గీ స్క్రిపాల్, ఆయన కుమార్తె యులియా స్క్రిపాల్ బ్రిటన్‌లోని శాలిస్బరీ పట్టణంలో ఒక షాపింగ్ మాల్ వద్ద ఈ నెల 4న అపస్మారకస్థితిలో పడి ఆసుపత్రిపాలైన ఉదంతం బ్రిటన్, రష్యాలమధ్య చిచ్చు రేపింది. వీరిద్దరిపైనా విష రసాయన ప్రయోగం జరిగిందన్నది ఆరోపణ. పర్యవ సానంగా రష్యా రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న 23మంది దౌత్యాధికా రులు తక్షణం దేశం విడిచి వెళ్లాలంటూ బ్రిటన్ హుకుం జారీ చేసింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఇలా పరస్పరం దౌత్యాధికారులను బహిష్కరించుకున్న చరిత్ర ఉంది. ఆ సంప్రదాయం మళ్లీ మొదలుకావడం ఆందోళన కలిగిస్తుండగా ఈ గొడ వలో తాజాగా ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా కూడా తలదూర్చాయి. ఈ ఉదంతంలో రష్యా తక్షణం సంజాయిషీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. ఈ ఉదంతంతో తమకేమాత్రం సంబంధం లేదని రష్యా అంటున్నది. సెర్గీ స్క్రిపాల్ రష్యా పౌరుడు, ఆ దేశ సైనిక ఇంటెలిజెన్స్‌లో ఉన్నతాధికారిగా పనిచేసినవాడు. వేరే దేశాలపై నిఘా ఉంచి సమాచారం రాబట్టాల్సిన స్క్రిపాల్ యూరప్‌లో తమ దేశం తరఫున పనిచేస్తున్న గూఢచారులు, వారి చిరునామాలు, వారి మారుపేర్లు వగైరాలను పదేళ్లపాటు బ్రిటన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థ ఎంఐ6కు అందజేశాడు. 2003లో పట్టుబడ్డాడు. ఈ కేసు పర్యవసానంగా అతని ఉద్యోగం పోవడంతోపాటు దేశద్రోహ నేరంకింద జైలు శిక్ష కూడా పడింది. 2010లో బ్రిటన్, రష్యాల మధ్య గూఢచారుల మార్పిడి ఒప్పందం కింద స్క్రిపాల్ విడుదలై బ్రిటన్ వెళ్లి పోయాడు. సాధారణంగా అయితే అక్కడితో ఆ వ్యవహారం ముగిసి పోవాల్సింది. కానీ రష్యాకు అలాంటి చరిత్ర లేదు. అది గతంలో సైతం ఇలా డబుల్ ఏజెంట్లుగా పని చేసిన ‘ద్రోహుల్ని’ వదల్లేదు. రష్యా గూఢచార సంస్థ కేజీబీలో పనిచేస్తూ అనంతర కాలంలో పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకిగా మారి బ్రిట న్కు వెళ్లిపోయిన అలెగ్జాండర్ లిత్వినెంకోను ఇదే తరహాలో 2006లో మట్టుబె ట్టారు. రష్యా వ్యాపారవేత్త బోరిస్ బెరిజోవ్స్కీని చంపడానికి పుతిన్ ప్రభుత్వం ఆదేశించిందని ఆరోపించి లిత్వినెంకో పుతిన్ ఆగ్రహానికి గురయ్యాడు. లిత్వినెం కోపై గుర్తు తెలియని వ్యక్తులు పొలో నియం–210 అనే అణుధార్మిక పదార్థాన్ని ప్రయోగించారని బ్రిటన్ పోలీసులు నిర్ధా రించారు. తమ భూభాగంలో లిత్వినెం కోపై విషప్రయోగం జరిపిన రష్యా పౌరుణ్ణి బ్రిటన్ గుర్తించి అప్పగించమని కోరినా పుతిన్ ప్రభుత్వం అంగీకరించలేదు. వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు విదేశాల్లో పర్యటించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం, స్నేహసంబంధాలు నెరపడం సర్వసాధారణం. దీనికి సమాంత రంగా ఆ దేశాల్లోనే గూఢచారులను నియమించుకుని వారిద్వారా సొంతంగా సమా చారం రాబట్టుకోవడం ఇంచుమించు ప్రతి దేశమూ చేసే పని. మిగిలిన దేశాల మాటెలా ఉన్నా అమెరికా ఈ విషయంలో ఆరితేరింది. అది ధూర్త దేశాలుగా పరిగణిస్తున్న ఇరాన్, ఉత్తరకొరియా, సిరియా వంటి దేశాలపై మాత్రమే కాదు... తనకు సన్నిహితంగా మెలగుతున్న బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియాలపై కూడా గూఢచర్యం సాగించింది. ఎడ్వర్డ్ స్నోడెన్ వీటిని సాక్ష్యాధారాలతో సహా వెల్లడించి అందరినీ నివ్వెరపరిచాడు. అమెరికా నిఘాకు బలైన దేశాల్లో మన దేశం కూడా ఉంది. శత్రు దేశాల ఎత్తుగడలేమిటో, ఆ దేశాల్లో అంతర్గత పరిస్థితులెలా ఉన్నాయో తెలుసుకోవడంలో వింతేమీ లేదు. శత్రుదేశం కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండ టం సాధారణం. కానీ మిత్ర దేశాలుగా ఉంటూ పరస్పరం సహకరించుకునే దేశాలు సైతం అవతలి దేశం ఏం చేస్తున్నదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రతి దేశమూ తమ సమస్త సమాచారాన్నీ బట్టబయలు చేసుకోదు. ఎంత మిత్రదేశమైనా చెప్పవలసినదేమిటో, చెప్పకూడనిదేమిటో పరిమితులు విధించుకుంటుంది. తమ సమాచారం బయటికిపొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అవతలి దేశం గుట్టు లాగడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలా ఎవరికి వారు సాగించే నిఘా కార్యకలా పాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంటాయి. 1971లో భారత్–పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరగడానికి ముందు నాటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యూహమేమిటో తమకు కేబినెట్ మంత్రి ద్వారా తెలిసేదని అప్పటి సీఐఏ డైరెక్టర్ రిచర్డ్ హెల్మ్స్ ప్రకటించాడు. 2009లో లండన్‌లో జరిగిన జీ–20 దేశాల సమావేశాలపై అమెరికా నిఘా పెట్టి వివిధ దేశాల ప్రతినిధి బృందాలు తమలో తాము మాట్లాడుకున్న సంభాషణల్ని రికార్డు చేసిందని స్నోడెన్ అయిదేళ్లక్రితం బయటపెట్టాడు. ఏ దేశం ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నదో తెలుసుకుని ముందు జాగ్రత్తలు తీసు కోవడం అమెరికా చర్యలోని ఆంతర్యం. జీ–20లో ఒకటి రెండు మినహా అన్నీ అమెరికా మిత్ర దేశాలే. పైగా ఆతిథ్యం ఇచ్చిన బ్రిటన్ అత్యంత సన్నిహిత దేశం. అయినా అమెరికా తన పోకడ మానుకోలేదు. ఇప్పుడు స్క్రిపాల్, అతని కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. వీరిపై ప్రయో గించిన పదార్థం ‘నోవిచోక్’ అయి ఉండొచ్చునంటున్నారు. ఇది నాడుల పనితీరును నియంత్రించే వ్యవస్థను దెబ్బతీస్తుందని, మనుషుల్ని క్షణాల్లో అశక్తులుగా మారుస్తుందని, ఒకసారి దీని బారిన పడితే కోలుకోవడం అంటూ ఉండదని చెబుతున్నారు. ఆ సంగతలా ఉంచి ఈ ఉదంతం రష్యాకూ, యూరప్ దేశాలకూ మధ్య ఎలాంటి చిచ్చు రేపుతుందో, ఇది ఎటు పోతుందో రాగలరోజుల్లో తెలు స్తుంది. పరస్పర గూఢచర్యం చివరికెలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలి యాలంటే స్క్రిపాల్ ఉదంతమే ఉదాహరణ. -
యువతి ఫోన్ ట్యాప్ చేయించిన మోడీ: కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉండే అర్హత నరేంద్ర మోడీకి లేదని కాంగ్రెస్ మహిళా నేతలు అన్నారు. గుజరాత్లో ఓ మహిళా ఆర్కిటెక్ ఫోన్‌ను చట్టవిరుద్ధంగా మోడీ ట్యాప్ చేయించారని వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2009లో అప్పటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా, ఓ ఐపీఎస్ అధికారికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను కోబ్రా పోస్ట్, గులైల్ ఇన్వెస్టిగేటివ్ పోర్టల్‌లు ఈ నెల 15న బయటపెట్టాయి. నరేంద్ర మోడీయే తన అనుచరుడు అమిత్ షాతో ఇదంతా చేయించారని కేంద్ర మంత్రులు జయంతి నటరాజన్, గిరిజా వ్యాస్, యూపీసీసీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా ఆరోపించారు. మహిళా గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించిన మోడీపై సుప్రీంకోర్టు జడ్డితో విచారణ జరిపించాలన్నారు. ఆ యువతి వ్యక్తి స్వేచ్ఛను ఎందుకు హరించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గుజరాత్‌ను పాలించే నైతిక, రాజకీయ అర్హత ఆయన కోల్పోయారని పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థిగా మోడీ అనర్హుడన్నారు.