ముంబై: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్‌పై శివసేన(ఉద్ధవ్) కీలక నేత, ఎంపీ సంజయ్‌రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని నాగ్‌పూర్‌లో ఓడించేందుకు షా, ఫడ్నవిస్‌లు పనిచేశారని రౌత్ ఆరోపించారు.
‘మోదీ, షా, ఫడ్నవిస్‌లు కలిసి గడ్కరీని ఓడించేందుకు గట్టిగా పనిచేశారు. అయితే గడ్కరీని ఓడించడం సాధ్యం కాదని గ్రహించిన తర్వాత ఫడ్నవిస్ ఆలస్యంగా నాగ్‌పూర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మాటలు నేను కాదు ఆర్‌ఎస్‌ఎస్ క్యాడరే బహిరంగంగా చెబుతోంది’ అని శివసేన(ఉద్ధవ్) అధికారిక పత్రిక సామ్నాలో రౌత్ కథనం రాశారు.
మరోపక్క అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ చెందిన క్యాండిడేట్లను ఓడించేందుకు సీఎం షిండే ఒక్కో నియోజకవర్గంలో రూ.25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈసారి మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగిని మారుస్తారు’అని రౌత్ తన కథనంలో పేర్కొన్నారు.
కాగా, రౌత్ రాసిన ఈ కథనంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ఫైర్ అయ్యారు. నిజానికి రౌత్ శివసేన అభ్యర్థుల గెలుపు కోసం కాకుండా ఎన్‌సీపీ(శరద్‌పవార్) అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. రౌత్‌కి దమ్ముంటే 2019లో సీఎం అవడానికి ఆయన చేసిన ప్రయత్నాలపై కథనం రాయాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment