ముంబై: ఇతర పార్టీ చీఫ్‌ల కాన్వాయ్‌లే లక్ష్యంగా బీజేపీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) పార్టీల కార్యకర్తలు దాడులు చేయటాన్ని ఇలాగే కొనసాగిస్తే.. తాము కూడా భవిష్యత్తులో ప్రతీకారం తీర్చుకుంటామని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. థానేలో శనివారం శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కాన్వాపై ఎంఎన్‌ఎస్ కార్యాకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై ఆదివారం సంజయ్ రౌత్ మాట్లాడారు. అహ్మద్ షా అబ్దాలీ (హోంశాఖ మంత్రి అమిత్ షాను పరోక్షంగా ఉద్దేశిస్తూ..)కు మహారాష్ట్రంలో దాడుల ద్వారా అరాచకం వ్యాప్తి చేయాలని ఢిల్లీలో ఉండే కేంద్ర పాలకులు సుపారీ ఇచ్చారని మండిపడ్డారు.
‘ఉద్దవ్ ఠాక్రే కాన్వాయ్‌పై శనివారం రాత్రి దాడి జరిగింది. ఇలాంటి చేయాలనే వాళ్లు ఉన్నారు. అమిత్ షా ఇలాంటి దాడులు చేయించడానికి ఢిల్లీ నుంచి సుపారీ అందుకున్నారు. ఎన్‌ఎన్‌ఎస్ కార్యకర్తలను ఇటువంటి పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ సదరు నేతలు మాత్రం ఢిల్లీ నుంచి సుపారీ తీసుకొని సైలెంట్‌గా ఉంటున్నారు. ఇలా దాడులకు తెగపడటం మహారాష్ట్రకు మంచిది కాదు. నేను ఏ పార్టీ పేరును ప్రస్తావించటం లేదు. కానీ, కొన్ని పార్టీలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇప్పటి నుంచే కుట్రలు పన్నుతున్నారు’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment