రేణుకా చౌదరీపై ఆన్లైన్ దుమారం | Twitterati slams Renuka Chowdhury for making baby-sitter stand while family dines at restaurant | Sakshi
Sakshi News home page

రేణుకా చౌదరీపై ఆన్లైన్ దుమారం

Published Thu, Jun 2 2016 3:49 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

రేణుకా చౌదరీపై ఆన్లైన్ దుమారం

రేణుకా చౌదరీపై ఆన్లైన్ దుమారం

కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరీపై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. ఆమె చేసిన చర్యని ఆన్ లైన్లో ఎండగట్టారు. తన కుటుంబంతో కలిసి ఓ ఫ్యామిలీ రెస్టారెంటుకు వెళ్లిన ఆమె తన ఇంట్లోని ఓ చిన్నపాపను చూసుకునే అమ్మాయికి కనీసం విలువ ఇవ్వకుండా వారంతా భోజనం చేశారు. ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చో అని కూడా చెప్పకుండా అలాగే నిల్చుబెట్టి ఉంచారు. అలాగే చేతులు కట్టుకుని నిల్చునేలా చేసినందుకు ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమంలో పలువురు ఆమెను ప్రశ్నించారు. రిషి బగ్రీ అనే వ్యక్తి ఆ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఒకే రోజు 1700మంది రీ ట్వీట్ చేశారు.

'ప్రియమైన రేణుకా చౌదరీగారూ.. మీ చిన్నారిని చూసుకునే అమ్మాయికి భోజనం పెట్టించలేనప్పుడు వారిని అసలు రెస్టారెంట్లకు తీసుకెళ్లకండి' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే పెద్ద వాళ్ల ఇళ్లలో వెలి కొనసాగుతుందని చెప్పడానికి ఈ దృశ్యం ఒక సజీవ సాక్ష్యం అని బదులిచ్చారు. ఇంకొంతమంది మాత్రం కాంగ్రెస్ పార్టీ కల్చర్ అని కూడా విమర్శించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పప్పుతో భోజనం చేస్తున్నప్పుడు రేణుకా ఇలాగే నిల్చుంటారని కూడా పేర్కొన్నారు. గతంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అయ్యి ఉండి ఇలా చేస్తారా అని కూడా కొందరు ప్రశ్నించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement