ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శుక్రవారం ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ... ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇదే సభలో హామీలిచ్చాం, అమలు చేయాల్సిన బాధ్యత లేదా? ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బంది ఏంట’ని సూటిగా ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడమే మానేసిందని కడిగిపారేశారు.