ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఇతర ప్రయోజనాల సాధనలో భాగంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఆందోళనను ఉధృతం చేస్తుండగా అధికారంలోని మిత్ర పక్షాలు టీడీపీ, బీజేపీలలో వణుకు మొదలైంది. దీంతో కేంద్ర తమకు ఇవ్వాల్సిన నిధుల్లో మోసం చేసిందని ఓవైపు టీడీపీ చెబుతోంటే.. మేం లెక్క ప్రకారం ఇస్తున్నా టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మిత్రపక్షం టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ తమకు మిత్రపక్షంగా ఉంటూనే బీజేపీని రోడ్డుపైకి ఈడుస్తుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడును మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు.