ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి పదేపదే అడ్డుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులతోపాటు రేణుకా చౌదరి పదేపదే మోదీ ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు.