సాక్షి, ఖమ్మం: కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరికి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ అయింది. చీటింగ్ కేసుకు సంబంధించి ఆమెకు ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్ క్లాస్ కోర్టు ఈ వారెంట్ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుక చౌదరి తన భర్తను మోసగించారంటూ కళావతి బాయి అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై రేణుకా చౌదరిపై ఖానాపురం హవేలీ పోలీసులు సెక్షన్ 420, 417 కింద నాలుగేళ్ల క్రితం కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కోర్టు పలుమార్లు రేణుకకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులు అందుకోకపోవడంతో పాటు, విచారణకు గైర్హాజరు కావడంతో న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment