‘ఎవ్వడ్రా అక్కడ పిచ్చివేషాలు వేసేది’ | Renuka Chowdhury Angry on Congress Workers in Khammam | Sakshi
Sakshi News home page

‘ఎవ్వడ్రా అక్కడ పిచ్చివేషాలు వేసేది’

Published Wed, Oct 2 2013 1:59 PM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM

‘ఎవ్వడ్రా అక్కడ పిచ్చివేషాలు వేసేది’

‘ఎవ్వడ్రా అక్కడ పిచ్చివేషాలు వేసేది’

ఖమ్మం: రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలంగాణవాదులపై తనకు గల ద్వేషాన్ని మరోసారి వెళ్లగక్కారు. నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లకు, పీఏసీఎస్ చైర్మన్లకు మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆమె మాట్లాడుతుండగా ఇల్లెందు, టేకులపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.ఆగ్రహించిన రేణుక ‘ఎవ్వడ్రా అక్కడ పిచ్చివేషాలు వేసేది’ అని గద్దిస్తూ అధికారులు, కాంగ్రెస్ నాయకుల వైపు చూశారు. నినాదాలు చేసిన వారిని పోలీసులు బయటకు తీసుకువెళ్లారు.

ఖమ్మం జిల్లా ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తై సందర్భంగా ఖమ్మంలోని స్తంభాద్రి గుట్టపై శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో మంగళవారం ప్రారంభమైన అవతరణ వేడుకల్లోనూ రేణుకాచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మంజిల్లా జ్యోతిని దేశమంతా ప్రతిబింబించేలా అవతరణ వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజలందరికీ జిల్లా చరిత్ర తెలిసేలా సమగ్ర సమాచారంతో ఒక సావనీర్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement